- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా యవ్వనమంతా వృథా చేశాడు.. ఆ విషయంలో అస్సలు శాటిస్‌ఫాక్షన్ లేదు.. ఆరేళ్లలో ఒక్కసారి కూడా.. భర్తపై కేసు వేసిన భార్య..
20 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి.. ఓ అబ్బాయిని కలిసింది. ప్రేమ, పిల్లలు, కలిసి భవిష్యత్తును నిర్మించడం గురించి చెప్పిన వాగ్ధానాలన్ని నమ్మింది. ఏడాది తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ వివాహమై ఆరేళ్లు గడిచినా ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో కోర్టుకు ఎక్కింది.

దిశ, ఫీచర్స్ : 20 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి.. ఓ అబ్బాయిని కలిసింది. ప్రేమ, పిల్లలు, కలిసి భవిష్యత్తును నిర్మించడం గురించి చెప్పిన వాగ్ధానాలన్ని నమ్మింది. ఏడాది తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ వివాహమై ఆరేళ్లు గడిచినా ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో కోర్టుకు ఎక్కింది. తన కలలను చిదిమేశాడని.. తన జీవితంలోని బెస్ట్ పీరియడ్ అయిన యవ్వనమంతా వృథా చేశాడని కేసు వేసింది. భావోద్వేగ ఒత్తిడి, అవకాశాల నష్టం, తప్పుడు ఆశలు చూపి తన జీవితాన్ని దోచుకున్నాడని ఆరోపించింది. విఫలమైన కలలు, తిరిగి పొందలేని సమయం.. పిల్లలు లేరు, ఇల్లు లేదు, వారసత్వం లేదు అంటూ బాధపడింది.బ్రీ ఆవరీ జాకరీ నివేదించిన ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చర్చను రేకెత్తిస్తుంది. నిజంగా రిలేషన్‌లో టైమ్ వేస్ట్ అయినందుకు కేసు వేయొచ్చా? అని చర్చించుకుంటున్నారు.
కాగా ఈ దావాకు కొందరు మద్దతిస్తుంటే ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ దావా నిజమైన సమస్యను హైలైట్ చేస్తుందని వాదిస్తున్నారు. ముఖ్యంగా 20 ఏళ్లలో వివాహం, పిల్లలను కలిగి ఉండాలనే సామాజిక ఒత్తిడిని ఎదుర్కొనే మహిళల ప్రధాన సమస్య ఇదేనని చెప్తున్నారు. ఆమె మాజీ భర్త తనను పూర్తిగా తప్పుదారి పట్టించాడని .. ఈ దావా అతడు బాధ్యత వహించేలా చేస్తుందని అంటున్నారు. సమయం ఒక పరిమిత వనరు అని.. వివాహంలో తప్పుడు ఉద్దేశాలు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని, ముఖ్యంగా స్త్రీలకు వారి సంతానోత్పత్తి కాలం పరిమితమైనదని వాదిస్తున్నారు.
ఇక ఇంకొందరు ఈ దావాను మీనింగ్‌లెస్‌గా భావిస్తున్నారు. సంబంధాలు సహజంగా రిస్క్‌తో కూడుకున్నవని.. న్యాయపరంగా చర్య తీసుకోగలది కాదని వాదిస్తున్నారు. ఇరువురు కూడా స్వచ్ఛందంగా వివాహంలోకి ప్రవేశించారని.. కన్న కలలు నిజం కాకపోతే భాగస్వామిని శిక్షించాలనేది ఈ కేసు అర్థమని, ఇది పూర్తిగా అర్థరహితమని చెప్తున్నారు. ‘వృథా అయిన యవ్వనం’ కొలవడం వ్యక్తిగతమైనదని.. ఇలాంటి విషయాలపై వ్యాజ్యం ఒక ప్రమాదకరమైన ఆదర్శాన్ని సృష్టించవచ్చని అంటున్నారు.






