టీనేజ్‌లో డైలీ షేవింగ్ చేసిన మహిళ.. ఇప్పుడు గుబురు గడ్డంతో..

by Dishanational4 |
టీనేజ్‌లో డైలీ షేవింగ్ చేసిన మహిళ.. ఇప్పుడు గుబురు గడ్డంతో..
X

దిశ, ఫీచర్స్ : ముఖంపై అవాంఛిత రోమాలు చాలామంది మహిళలను ఇబ్బంది పెడుతుంటాయి. పైగా హెయిర్ రిమూవల్ ప్రొడక్ట్స్‌తో శాశ్వత పరిష్కారం లభించదు. ఇక సరైన అవగాహనలేని వారు తరచూ షేవింగ్‌ చేస్తూ సమస్య తీవ్రతకు తామే కారణమవుతుంటారు. అచ్చం ఇలాగే తన టీనేజ్‌లో ముఖంపై అవాంఛిత రోమాలను షేవ్ చేయడం మొదలుపెట్టిన ఓ మహిళ.. ప్రస్తుతం ముఖం నిండా గుబురు గడ్డంతో విలక్షణంగా తయారైంది.

30 ఏళ్ల డకోటా కుక్.. తన ముఖంపై అసాధారణమైన జుట్టు పెరుగుదలను మొదట 13 ఏళ్ల వయసులో గమనించింది. దీన్ని అసౌకర్యంగా భావించిన ఆమె.. వారానికోసారి వాక్సింగ్ చేయించుకోవడం నుంచి రోజుకు రెండుసార్లు తన ఫేస్‌పై హెయిర్‌ను షేవ్ చేయడం వంటి పనులతో చాలా అసౌకర్యాన్ని అనుభవించింది. అంతేకాదు ఇలా తరచూ షేవ్ చేయడం మూలాన ఆమె ముఖంపై ఉన్నటువంటి పలుచని, లేత రంగులోని వెంట్రుకలు క్రమంగా పొడవాటి, ముదురు గడ్డానికి మారిపోయాయి.

మొహం మీద వెంట్రుకలు ఉన్న మహిళలు చాలా కళంకం కలిగి ఉన్న కాలంలో పెరిగానని చెప్పిన డకోటా.. ఫొటోల్లో తన ముఖాన్ని దాచేందుకు ప్రయత్నించానని, ప్రతి వారం వాక్సింగ్ సెషన్‌లకు హాజరయ్యేదాన్నని తెలిపింది. పైగా ఆమె అనేక పరీక్షలు చేయించుకున్నప్పటికీ ముఖంపై వెంట్రుకలకు గల కారణాన్ని వైద్యులు గుర్తించలేకపోయారు. అడ్రినల్ గ్రంథులు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడం వల్ల ఇది జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇక రెగ్యులర్ షేవింగ్ వల్ల ఆమె చర్మంపై ఏర్పడిన మచ్చలు, దద్దుర్లను మేకప్‌తో కవర్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, 2015లో డకోటా స్నేహితుల్లో ఒకరు ఆమెను సర్కస్ షోలో పాల్గొనమని అడిగారు. సదరు షోలో గడ్డం ఉన్న మహిళగా ఉండాలనే ఆలోచన తనకు కూడా నచ్చడంతో అప్పటి నుంచి రేజర్లు, వాక్సింగ్‌ను తొలగించింది. కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంత సులభం కాదు. గడ్డం పెంచడం ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. చివరకు ఆమె దాని గురించి బాధపడటం మానేసింది. 'నా స్వీయ-అంగీకార ప్రయాణంలో నా కుటుంబం, స్నేహితులు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు' అని చెప్పింది.

Read More : బ్లాక్-నేప్డ్ నెమలి..140 ఏళ్ల తర్వాత ఆచూకీ

Next Story

Most Viewed