Health : చలి కాలం కదా అని నీళ్లు తక్కువగా తాగితే.. ఈ రిస్క్ తప్పదంటున్న నిపుణులు!

by Javid Pasha |

Health : చలి కాలం కదా అని నీళ్లు తక్కువగా తాగితే.. ఈ రిస్క్ తప్పదంటున్న నిపుణులు!

Health : చలి కాలం కదా అని నీళ్లు తక్కువగా తాగితే.. ఈ రిస్క్ తప్పదంటున్న నిపుణులు!
X

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో దాహం ఎక్కువగా వేయదు. కూల్ వెదర్ కారణంగా చాలా మంది వాటర్ తక్కువగా తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సీజన్లతో సంబంధం లేకుండా రోజులో 2 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగితేనే హెల్తీగా ఉంటామని పేర్కొంటున్నారు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా తాగినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ నీరు తాగడంవల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలేవో చూద్దాం.

క్రానిక్ ఫెటీగ్

వింటర్‌లో నీళ్లు తక్కువగా తాగితే ఆ ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. అవయవాలకు రక్త సరఫరాలో తేడాలు వస్తాయి. దీంతోపాటు తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా క్రానిక్ ఫెటీగ్‌కు దారితీయవచ్చు. అంటే ప్రతి రోజూ తీవ్రమైన అలసట లేదా తలనొప్పి వంటివి అనుభవించే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. కాబట్టి దాహం వేయకపోయినా శరీరానికి సరిపడా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడి, ఇతర అనారోగ్యాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది.

గుండెపై ఒత్తిడి

తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో పొటాషియం, సోడియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బ తింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. హార్ట్ రేట్‌లో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. అంతేకాకుండా నీరు తక్కువగా తాగడంవల్ల బాడీలో బ్లడ్ సర్య్యులేషన్ సక్రమంగా జరగని కారణంగా అవయవాత పనితీరు మందగిస్తుంది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కిడ్నీలు, జీర్ణ వ్యవస్థపై ప్రభావం

వింటర్‌లో తక్కువ నీరు తాగడం మెటబాలిజంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. దీంతో తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాదు. ఫలితంగా కడుపులో ఉబ్బరం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ట్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సరిపడా నీళ్లు తాగితేనే కిడ్నీలు చురుకుగా పనిచేస్తాయి. అవి రక్తం నుంచి వ్యర్థాలను వడబోసి యూరిన్ రూపంలో బయటకు పంపడానికి నీరు చాలా ముఖ్యం. అలాగే నీరు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. ఎలక్ట్రోలైట్స్ తగ్గడం కారణంగా కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి రోజూ కనీసం 2 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story