Health Benefits of Wine : ఎంత మోతాదులో తాగితే బెటర్?

by Disha Web Desk 6 |
Health Benefits of Wine : ఎంత మోతాదులో తాగితే బెటర్?
X

దిశ, ఫీచర్స్ : పులియబెట్టిన ద్రాక్షపళ్ల రసంతో తయారు చేయబడే ఆల్కహాలిక్ పానీయమే వైన్. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా కాలంగా వైన్‌ జీర్ణక్రియకు సహాయకారిగా, పలు వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగించబడింది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2018 అధ్యయనం ప్రకారం రెడ్ వైన్‌లో ఉండే పాలీఫెనాల్స్ ఆరోగ్యకరమైన హృదయనాళ పనితీరుకు అవసరమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఆహారం, పానీయాల్లో వాటిని చేర్చడం వల్ల డయాబెటిస్, కొన్ని క్యాన్సర్లతో పాటు హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదం తగ్గుతుంది.

వైన్‌గా మితంగా సేవించినప్పుడు కలిగే ఆరు ప్రయోజనాలు :

* కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది : ఇటీవలి అధ్యయనాల ప్రకారం రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే హానికర కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఇందుకోసం రియోజా-స్టైల్ రెడ్ వైన్స్ ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందాయి.

* గుండె ఆరోగ్యానికి మేలు : వైన్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించడంతో పాటు మొత్తం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రెడ్ వైన్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లలో పాలీఫెనాల్స్ ఒకటి. ఇవి రక్తనాళాల్లో ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండి క్లాట్స్ నివారించడంలో సాయపడతాయి.

* బ్లడ్ షుగర్ నియంత్రణలో హెల్ప్‌ఫుల్ : ద్రాక్ష తొక్కలోని నేచురల్ యాంటీఆక్సిడెంట్ 'రెస్వెరాట్రాల్'.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రెస్వెరాట్రాల్‌పై ఒక అధ్యయనం ప్రకారం దాదాపు మూడు నెలల పాటు ప్రతిరోజూ ఈ పదార్థాన్ని దాదాపు 250 mg తీసుకున్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయి.

* డిప్రెషన్‌ను దూరం చేస్తుంది : సాపేక్షంగా మితమైన మొత్తంలో ఆల్కహాల్ వాడకం డిప్రెషన్‌ను డెవలప్ చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది. అందుకే రెడ్ వైన్ తాగేవారు డిప్రెషన్ నుంచి నిజంగానే రక్షణ పొందగలరు. అయినప్పటికీ కేవలం వైన్ తాగడం ద్వారా డిప్రెషన్‌ను తగ్గించుకోవాలనుకోవడం మాత్రం సరైన ఎంపిక కాదని గ్రహించడం ముఖ్యం.

* దీర్ఘాయువును అందిస్తుంది : రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే.. తీసుకోనివారి కంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. ఎందుకంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నందున దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి రక్షణ కల్పించి సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాలను ప్రోత్సహిస్తుంది.

* డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది : వైన్ సేవనం మెదడు క్షీణతను అరికట్టవచ్చు. మితంగా తాగేవారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 23% తక్కువని ఒక అధ్యయనం కనుగొంది.

Also Read :'భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం'


Also Read : Health Tips: లవంగ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?



Next Story

Most Viewed