- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింపుల్ వచ్చిందని జాబ్ మానేయడమేంట్రా బాబు.. పైగా ఆఫీసుకు కూడా వార్నింగ్ ఇవ్వడం..
లింక్డ్‌ఇన్‌లో ఓ స్టోరీ వైరల్ అవుతోంది. పింపుల్ వచ్చిందని ఉద్యోగం మానేసిన ఘటనపై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. గ్లోయింగ్ స్కిన్ కలిగిన ఎంప్లాయీ జాయిన్ అయిన కొద్ది రోజులకు నుదుటి మీద పింపుల్ వచ్చింది.

దిశ, ఫీచర్స్ : లింక్డ్‌ఇన్‌లో ఓ స్టోరీ వైరల్ అవుతోంది. పింపుల్ వచ్చిందని ఉద్యోగం మానేసిన ఘటనపై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. గ్లోయింగ్ స్కిన్ కలిగిన ఎంప్లాయీ జాయిన్ అయిన కొద్ది రోజులకు నుదుటి మీద పింపుల్ వచ్చింది. దీంతో బాగా ఫీల్ అయిపోయిన ఆ అందగాడు.. ఛీ జాబ్ ఉంటే ఏంటి ఊడితే ఏంటి.. నాకు నా అందం ముఖ్యం.. అనుకుని రాజీనామా చేసేశాడు. ఆఫీసులో కెమికల్ ఎక్స్‌పోజర్ వల్ల తన హ్యాండ్సమ్‌నెస్ కోల్పోయానని... ఎంప్లాయీ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడున్నాయని కంపెనీని కూడా నిలదీశాడు. ఇది కొంచెం వింతగా అనిపించడంతో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది.
మాన్యుఫాక్చరింగ్ లైన్‌లో పని చేసే ఓ ఫ్యాక్టరీ వర్కర్‌కు సడెన్‌గా పింపుల్ వచ్చింది. మెషినరీ క్లీన్ చేసే ప్రాసెస్‌లో భాగంగా ఇథనాల్ కెమికల్ ఎక్స్‌పోజర్‌తో ఇలా జరిగిందనేది అనుమానం. దీంతో సదరు ఉద్యోగి దీన్ని హెల్త్ ఇష్యూగా పరిగణిస్తూ రిజైన్ చేశాడు. వర్క్ ప్లేస్ అనేది స్ట్రిక్ట్ సేఫ్టీ ప్రొటోకాల్స్ కలిగి ఉండాలని.. గ్లోవ్స్, గాగుల్స్, మాస్క్, ఆప్రాన్స్, ఫిల్టర్డ్ వెంటినేషన్ సిస్టమ్స్ కచ్చితంగా మెయింటెన్ చేయాలని.. కానీ ఇవేవి సరిగ్గా లేకపోవడం వల్ల తనకు ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఈ స్టోరీ పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ట్రెండింగ్‌లోకి రాగా కామెంట్స్ చాలా ఫన్నీగా వస్తున్నాయి. ఆఫీసు నుంచి వెళ్లిపోయేందుకు ఒక సాకు కావాలి కాబట్టి పింపుల్‌ను అస్త్రంగా వాడాడని కొందరు కామెంట్స్ చేస్తే.. ఇందులో తప్పేముంది తన ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తూ తప్పుకున్నాడని ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు.






