Newspaper: న్యూస్ పేపర్‌ చివరిలో రంగుల చుక్కలు ఎందుకు ఉంటాయి..?

by Kanadam.Hamsa lekha |

కొన్ని చిన్న చిన్న విషయాలు కామన్‌గా అనిపించేవి లేదా కనిపించేవి ఉంటాయి. వాటిని చాలామంది అస్సలు పట్టించుకోరు.

Newspaper: న్యూస్ పేపర్‌ చివరిలో రంగుల చుక్కలు ఎందుకు ఉంటాయి..?
X

దిశ, ఫీచర్స్: కొన్ని చిన్న చిన్న విషయాలు కామన్‌గా అనిపించేవి లేదా కనిపించేవి ఉంటాయి. వాటిని చాలామంది అస్సలు పట్టించుకోరు. అసలు అవి అలాగే ఎందుకు ఉన్నాయి..? ఇందులో ఏమైన అర్థం ఉందా? అని చాలామంది తెలుసుకోవడానికి ట్రై చేయరు. అలాంటి కామన్ విషయమే న్యూస్ పేపర్‌ చివరిలో ఉండే రంగులు. సాధారణంగా చాలా మంది మార్నింగ్ టైమ్‌లో పేపర్ చదువుతూ.. అందులో జరిగే విషయాల గురించి తెలుసుకుంటారు. కానీ, పేపర్‌లోని ప్రతీ పేజ్‌లో ఉండే నాలుగు చుక్కలను గమనించరు. కొందరు వాటిని పేపర్ డిజైన్ కోసం వేశారమోనని అనుకుంటారు. అయితే, ఏ కారణం లేకుండా వాటిని ఎందుకు ప్రింట్ చేశారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా. దీని వెనుక ఒక కారణం ఉంది. అదేంటో ఇక్కడ చదివేయండి.

న్యూస్ పేపర్స్ అన్నింటిని గమనిస్తే చివరిలో నాలుగు రంగుల చుక్కలు కనిపిస్తాయి. ఆ రంగులను CMYK అని అంటారు. C అంటే సియాన్ (నీలం), M అంటే మెజెంటా (పింక్), Y అంటే ఎల్లో, ఇక చివరిది K ఇది నలుపు రంగును సూచిస్తుంది. ఈ నాలుగు రంగులను ప్రింటింగ్ పరిభాషలో ప్రాథమిక రంగులుగా సూచిస్తారు. ఈ రంగులను ఆధారంగా చేసుకునే పేపర్‌ని ప్రింట్ చేస్తారు. అదెలా అని అనుకుంటున్నారా.? వార్తలను, వాటికి సంబంధించిన ఫోటోలను పేపర్‌లో ప్రింట్ చేసేటప్పుడు ప్రతీ పేపర్‌ని ఓపెన్ చేసి, సరిగా ప్రింట్ అయ్యిందా..? లేదా? అని చూడడం కష్టంగా ఉంటుంది. అందుకే పేపర్‌లోని ప్రతీ పేజీకి చివరిలో CMYK రంగులను ప్రింట్ చేస్తారు. ఒకవేళ ఈ నాలుగు రంగులు సరిగ్గా ప్రింట్ కాకుండా.. బ్లర్‌గా వస్తే వెంటనే కలర్ ప్లేట్లను సెట్ చేసి, మళ్ళీ ప్రింట్ చేస్తారు. ఇదే పేపర్‌లో ఉండే రంగు చుక్కల కథ.

Next Story