ఆకాశంలో ఎగిరే హక్కు నీకెవరిచ్చారు.. నెట్టింట సూపర్ ఫొటో వైరల్‌!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-28 11:57:50  IST  )

గద్దలు, రాబందులు, డేగలు.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పక్షులు.

ఆకాశంలో ఎగిరే హక్కు నీకెవరిచ్చారు.. నెట్టింట సూపర్ ఫొటో వైరల్‌!
X

దిశ, వెబ్ డెస్క్: గద్దలు, రాబందులు, డేగలు.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పక్షులు. ఇవి వేటాడే తీరు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆకాశంలో విహరిస్తూనే.. నేలపై చిన్ని చిన్న జీవులను, సముద్రంలోని చేపలను సైతం ఇట్టే పసిగట్టి వాయువేగంతో వేటాడేస్తాయి. ఒక్కసారి వాటి కన్ను పడిదంటే.. ఇక వాటి బారి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అంతేకాదు, ఇవి ఒక్కోసారి మనుషులపై కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా నెట్టింట ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఓ డేగ దాన్ని కాళ్లతో డ్రోన్‌ను గట్టిగా పట్టుకుంది. ఆకాశంలో ఎగిరే హక్కు దానికెవరిచ్చారనుకుందో ఏమో వెంటనే దాన్ని బంధించేసింది. 'నేచర్ ఇజ్ అమేజింగ్ (Nature is Amazing)' అనే ఎక్స్ ఖాతాలో 'The Picture of the Century.. Nature defeats Technology' అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్ చేయగా, నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ క్యాప్షన్, సూపర్ ఫొటో అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాగా, కొన్ని దేశాల్లో ఆర్మీ ఇతర దేశాల డ్రోన్లను నివారించేందుకు డేగలకు డ్రోన్లపై దాడి చేసేందుకు ఈ విధమైన శిక్షణను అందజేస్తున్నాయి.

Next Story