- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శరీరం మాట్లాడుతుంది..! ఈ సంకేతాలు వింటే ఆరోగ్యానికి ఢోకా లేనట్టే!
సాయంత్రమో, రేపో మీకు జ్వరం రావచ్చు.. లేదా మరికొన్ని గంటల్లో జలుబు చేయవచ్చు అనే విషయాన్ని మీ శరీరం కొన్ని లక్షణాల రూపంలో ముందుగానే హెచ్చరిస్తుంది.

దిశ, ఫీచర్స్ : మనుషులు మాట్లాడుకోవడం, మనలో మనం మనసులో మాట్లాడుకోవడం సహజమే, కానీ.. శరీరం కూడా మాట్లాడుతుందని మీకు తెలుసా? కాకపోతే అది సంకేతాల రూపంలో ఉంటుంది! ముఖ్యంగా మీ బాడీలో పోషకాలో, విటమిన్లో మిస్ అయిప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు లేదా సంకేతాల ద్వారా అది తెలియజేస్తుంది. అప్పుడు దాని మాట వింటే బాగుపడతారు. లేకుంటే అనారోగ్యం పాలవుతారు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. అదెలాగో తెలుసుకుందాం పదండి!
లోపాన్ని గుర్తించే సంకేతాలు
సాయంత్రమో, రేపో మీకు జ్వరం రావచ్చు.. లేదా మరికొన్ని గంటల్లో జలుబు చేయవచ్చు అనే విషయాన్ని మీ శరీరం కొన్ని లక్షణాల రూపంలో ముందుగానే హెచ్చరిస్తుంది. ఇదే కాదు పలు దీర్ఘకాలిక సమస్యలను, శరీరంలో ఏర్పడిన లోపాలను సైతం గుర్తు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎక్కువగా వస్తోందంటే విటమిన్ B12 లేదా ఐరన్ లోపం వల్ల కావచ్చు.
ఏ సమస్య దేనివల్ల?
తరచుగా మూడ్ స్వింగ్స్ ఎదుర్కొంటున్నారంటే.. విటమిన్ D లేదా మెగ్నీషియం లోపం వల్ల కావచ్చు. అలాగే పెదాల పగుళ్లు విటమిన్ B2 లోపం, అలసట విటమిన్ C లేదా ఐరన్ లోపం, చర్మం డ్రైగా మారడం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల సంభవిస్తాయి. ఇవన్నీ మీ శరీరంలో ముందే ప్రారంభమైనట్టు సంకేతాలు కనబడతాయి. అయితే ముందుగా గుర్తిస్తే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వైద్య నిపుణులను సంప్రదిస్తే తగిన పరిష్కారం చూపుతారు. ముఖ్యంగా సహజమైన ఆహారాల ద్వారా లోపించిన పోషకాలను, విటమిన్లను పొందవచ్చు.
అవగాహన నుంచి పరిష్కారం వరకు
వాస్తవానికి హీలింగ్ అనేది అవగాహన నుండి ప్రారంభమైనట్లే.. అనారోగ్యాలను రాకుండా చూసుకోవడమనేది మీరు తీసుకునే పోషకాల నుంచి ప్రారంభించవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఉదాహరణకు తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి గింజలు, ఆకుకూరలు, మాంసం వంటి B12 అధికంగా లభించే ఆహారాలు తినడం ప్రారంభించాలి. ఇక మూడ్ స్వింగ్స్ నివారణ కోసం డైలీ కాసేపు ఎండలో గడపడం, ఆహారాల విషయానికి వస్తే చేపలు, వివిధ గింజలతో విటమిన్ D, మెగ్నీషియం వంటివి పొందవచ్చు. అలాగే చర్మం లేదా పెదాల పగుళ్ల నివారణకు పాలు, పాల ఉత్పత్తులు, బీన్స్ (B2), అలసటకు నారింజ, కివీ(విటమిన్ C) లేదా రెడ్ మీట్, ఆకుకూరలు (ఐరన్) వంటివి ఎంచుకోండి. ఈ సహజ ఆహారాలు మీ శరీర లోపాలను నివారించి, ఎటువంటి మందులు లేకుండా ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Link






