WhatsApp secrets : వాట్సాప్‌లో ఆ రహస్యాలు.. బయట పడకూడదంటే..!!

by Javid Pasha |   (  Updated:2025-06-26 12:26:02  IST  )

WhatsApp secrets : వాట్సాప్‌లో ఆ రహస్యాలు.. బయట పడకూడదంటే..!!

WhatsApp secrets : వాట్సాప్‌లో ఆ రహస్యాలు.. బయట పడకూడదంటే..!!
X

దిశ, ఫీచర్స్ : వాట్సాప్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన మోస్ట్ పవర్ ఫుల్ కమ్యూనికేషన్ యాప్‌. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాట్సాప్ యూజ్ చేయనిదే ఏం తోచదు కొందరికి. అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన పనులు, లావాదేవీలు సైతం దీనిపై ఆధారపడి జరుగుతున్నాయి. అయితే వాట్సాప్ కాల్స్, ఛాటింగ్స్ విషయంలో భద్రతపట్ల పలువురు అనుమానాలు, ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అలాంటి పరిస్థితులను నివారించేందుకు మెటా యాజమాన్యం ఇటీవల యూజర్ల గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అవేమిటి? ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తాయో ఇప్పుడు చూద్దాం.

అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ

అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ (Advanced Chat Privacy) ఫీచర్.. ఇది యూజర్లకు ఛాటింగ్ ప్రైవసీని అందిస్తుంది. అదనపు నియంత్రణను అందిస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే గ్రూప్ ఛాట్‌లలో సేఫ్టీపై భరోసా కల్పిస్తుంది. ఎందుకంటే ఈ ఫీచర్ మనం ఇతరులకు సెండ్ చేసిన మెసేజెస్ లేదా ఫొటోలు, వీడియోలు అవతలి వ్యక్తి ఫార్వర్డ్ చేసే అవకాశాన్ని, సేవ్ చేసుకునే అవకాశాన్ని నిరోధిస్తుంది. మొబైల్‌లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా చేస్తుంది. ఏఐతో కూడా థర్డ్‌పార్టీ కన్వర్జేషన్స్‌ను ఉపయోగించకకుండా నిరోధిస్తుంది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో కలిసి అదనపు భద్రతను కల్పిస్తుంది. కాబట్టి ఈ ఫీచర్‌ను సెట్ చేసుకోవాలనుకుంటే ఛాట్ ఓపెన్ చేసి, ఛాట్ పేరు పైన ట్యాప్ చేసి, “Advanced Chat Privacy” ఎంచుకోండి. టోగుల్ ఆన్ చేయండి చాలు.

ఛాట్ థీమ్స్

వాట్సాప్ రీసెంట్‌గా ఛాట్ థీమ్స్ ఫీచర్‌ను కూడా ప్రవేశ పెట్టింది. ఇది యూజర్లకు తమ ఛాట్ బ్యాక్‌గ్రౌండ్‌లను నచ్చినట్లు కస్టమైజ్(Customize) చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ డిఫరెంట్ కలర్స్ (Different colors)ను, డిజైన్‌లతో ఛాట్‌లను పర్సనలైజ్(Personalize) చేస్తుంది. దీనివల్ల కన్వర్జేషన్స్ మరింత అట్రాక్టివ్‌గా ఉంటాయి. యూజర్లు ప్రతీ ఛాట్‌కు వేర్వేరు థీమ్‌లను సెట్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్ లేదా పర్సనల్ ఈజీగా గుర్తించడానికి సహాయపడుతుంది. దీనిని సెట్ చేయడానికి ఛాట్ ఓపెన్ చేసి, దానిపైన ట్యాప్ చేసి “Chat Theme” లేదా “Wallpaper” సెలెక్ట్ చేసుకుంటే సరి. ఎంచుకున్న థీమ్ ఆ ఛాట్‌కు మాత్రమే పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ యూజర్లకు తమ సంభాషణలను విజువల్‌గా వేరు చేయడానికి కూడా సహాయపడుతుంది.

డిఫాల్ట్ కాలింగ్ అండ్ మెసేజింగ్ యాప్

వాట్సాప్ iOS యూజర్లకోసం ప్రవేశ పెట్టిన సరి కొత్త ఫీచర్‌ డిఫాల్ట్ కాలింగ్ అండ్ మెసేజింగ్ యాప్. దీనివల్ల iOS 18.2 లేదా తదుపరి వెర్షన్‌లలో వాట్సాప్‌ను డిఫాల్ట్ కాలింగ్, అండ్ మెసేజింగ్ యాప్‌గా సెట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు ట్రెడీషినల్ ఫోన్ కాల్స్, అండ్ ఎస్‌ఎంఎస్‌కు బదులుగా వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి సౌలభ్యం(convenience) కల్పిస్తుంది. ఐఫోన్ యూజర్లు Settings > Apps > Default Appsకి వెళ్లి, కాలింగ్ అండ్ మెసేజింగ్ కోసం WhatsAppను ఎంచుకొని సెట్ చేసుకోవచ్చు.

వాయిస్ ఛాట్ ఫీచర్

వాట్సాప్ గ్రూపుల కోసం మెటా వాయిస్ ఛాట్ ఫీచర్‌ను కూడా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇది గ్రూప్ మెంబర్స్ రియల్-టైమ్‌లో వాయిస్ ద్వారా సంభాషించడానికి అనుమతిస్తుంది. ఇది గేమింగ్ గ్రూపులు, కమ్యూనిటీ డిస్కషన్‌లు లేదా ఫ్యామిలీ మీటింగ్స్‌కు ఉపయోగపడుతుంది. ఇది డిస్కార్డ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల స్టైల్‌లో పనిచేస్తుంది. దీనిని సెట్ చేసుకోవడానికి గ్రూప్ ఛాట్‌లో, టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న వాయిస్ ఛాట్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. “Start Voice Chat” ఎంచుకొని సెట్ చేసుకుంటే సరి. వాయిస్ ఛాట్ ప్రారంభమైన తర్వాత, గ్రూప్ సభ్యులు ఎప్పుడైనా జాయిన్ అవ్వవచ్చు లేదా లీవ్ చేయవచ్చు. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా ఉంటుంది.

ప్రైవేట్ ప్రాసెసింగ్ ఫర్ క్లౌడ్-బేస్డ్

వాట్సాప్ క్లౌడ్-బేస్డ్ AI ఫీచర్ల కోసం ప్రైవేట్ ప్రాసెసింగ్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల మెటా ఏఐ వంటి టూల్స్ యూజర్ల డేటాను సేఫ్‌గా ప్రాసెస్ చేయగలవు. ఈ ఫీచర్ ఏఐ సేవలను లేదా సర్వీసులను ఉపయోగిస్తున్నప్పుడు డేటా ప్రైవసీని కాపాడుతుంది. ఇక సెట్ చేసుకోవాలనుకున్నవారు Settings > Privacy > AI Featuresకి వెళ్లి, ప్రైవేట్ ప్రాసెసింగ్ ఆన్ చేయాలి. దీంతో యూజర్ల సమాచారం లీక్ కాకుండా ఉంటుంది.

కాంటాక్ట్ డేటాబేస్ ఎన్‌క్రిప్షన్

అక్టోబర్ 2024 నుంచి వాట్సాప్ కాంటాక్ట్ డేటాబేస్‌లను ఎన్‌క్రిప్ట్ చేయడం(Encrypted Contact Databases) ప్రారంభించింది. దీనివల్ల కాంటాక్ట్ లిస్ట్ డివైస్‌కు బదులుగా అకౌంట్‌తో లింక్ అవుతుంది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. డివైస్ మార్చినప్పుడు కాంటాక్ట్‌లను సురక్షితంగా సమకాలీకరించడాని (synchronize)కి సహాయపడుతుంది. ఇది Settings > Privacy > Contactsకి వెళ్లి, ఎన్‌క్రిప్షన్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు.

ఛాట్ లాక్, సీక్రెట్ కోడ్

వాట్సాప్ లాక్డ్ ఛాట్స్‌ను దాచడానికి సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా యూజర్లకు తమ ప్రైవేట్ ఛాట్‌లను పాస్‌వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్‌తో లాక్ చేయడమే కాకుండా, వాటిని దాచడానికి ఒక సీక్రెట్ కోడ్ సెట్ చేయవచ్చు. అందుకోసం ఛాట్ పైన లాంగ్ ప్రెస్ చేసి “Lock Chat” ఎంచుకోండి. తర్వాత Settings > Privacy > Locked Chatsకి వెళ్లి “Secret Code” సెట్ చేయండి చాలు. ఇలా చేస్తే లాక్డ్ ఛాట్‌లు ఛాట్ లిస్ట్‌లో కనిపించవు. వాటిని యాక్సెస్ చేయడానికి సీక్రెట్ కోడ్‌ను సెర్చ్ బార్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ప్రాక్సీ కాల్స్ ద్వారా లొకేషన్ దాచడం

వాట్సాప్ కాల్స్ సమయంలో యూజర్లు లొకేషన్‌ను హైడ్ చేయడానికి ప్రాక్సీ సర్వర్‌ల (Proxy servers) ద్వారా కాల్స్‌ను రౌట్ చేసే ఫీచర్‌(Call routing feature)ను అందిస్తుంది. ఇది యూజర్ల ప్రైవసీని కాపాడుతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ కాల్స్ (Sensitive calls) విషయంలో భద్రత కల్పిస్తుంది. సెట్ చేసుకోవడానికి Settings > Privacy > Callsకి వెళ్లి, “Use Proxy” ఆప్షన్‌ను ఆన్ చేసి, అందుబాటులో ఉన్న ప్రాక్సీ సర్వర్‌ను ఎంచుకుంటే చాలు.

Next Story