రెండు వారాలపాటు నేలపై పడుకుంటే శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా?

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-27 12:45:41  IST  )

నేలపై పడుకోవడం అనేది వివిధ సంస్కృతులు, సంప్రదాయాలలో ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ పద్ధతి భంగిమ, వెన్నెముక అమరిక, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని నమ్ముతారు. మోడ్రన్ పరుపులు మెత్తగా

రెండు వారాలపాటు నేలపై పడుకుంటే శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా?
X

దిశ, ఫీచర్స్ : నేలపై పడుకోవడం అనేది వివిధ సంస్కృతులు, సంప్రదాయాలలో ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ పద్ధతి భంగిమ, వెన్నెముక అమరిక, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని నమ్ముతారు. మోడ్రన్ పరుపులు మెత్తగా, సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. నేలపై నిద్రించడం వల్ల శరీరం మరింత సహజమైన స్థితిలో విశ్రాంతి తీసుకునే చాన్స్ ఉందని వాదిస్తున్నారు కొందరు. అయితే రెండు వారాలపాటు ఇలా ప్రయత్నిస్తే జరిగే శారీరక మార్పుల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

శారీరక మార్పులు

కఠిన ఉపరితలంపై పడుకోవడం వెన్నెముక అమరిక, ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువైన పరుపు వల్ల వెన్నునొప్పి ఉన్నవారికి నేలపై పడుకోవడం హెల్ప్ అవుతుంది. గట్టిగా ఉండే నేల వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. అసౌకర్య మార్గాల్లో వంగడాన్ని తగ్గిస్తుంది. కానీ ప్రతికూలత ఏమిటంటే నేలపై పడుకోవడం నొప్పికి దారితీస్తుంది. ఎందుకంటే తుంటి లేదా మోకాళ్ల వంటి ప్రెజర్ పాయింట్స్‌ను రక్షించడానికి మృదువైనది లేదు. ముఖ్యంగా తుంటి, భుజాలలో ఎక్కువ ఒత్తిడి, ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలు లేదా కండరాల క్షీణత ఉన్నవారికి ఇబ్బంది కలగొచ్చు. వృద్ధులు లేదా బోలు ఎముకల వ్యాధి ఉన్న వ్యక్తులు కఠిన నేలపై నిద్రిస్తున్నప్పుడు ఎముక ఒత్తిడి లేదా కీళ్ల దృఢత్వాన్ని పెంచవచ్చు. గర్భిణీ స్త్రీలు కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఎక్కువ కుషనింగ్ అవసరమయ్యే పరిస్థితులు ఉన్నవారికి ప్రతికూలంగా అనిపించవచ్చు.

నిద్ర నాణ్యతపై ప్రభావం

నిద్ర నాణ్యతను సౌకర్యం, ఒత్తిడి ఉపశమనం, నిద్ర చక్రాలతో సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. గట్టి ఉపరితలంపై పడుకోవడం వల్ల సపోర్టివ్ మెట్రెస్ కంటే స్థానికంగా ఒత్తిడి పాయింట్లు ఎక్కువగా ఏర్పడతాయి. కఠినమైన ఉపరితలాలపై ప్రెజర్ పాయింట్స్ తరచుగా ప్లేస్ చేంజెస్‌కు కారణమవుతాయని, సహజ నిద్ర చక్రానికి భంగం కలిగిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాలక్రమేణా ఇది నిద్ర విచ్ఛిన్నానికి దారితీస్తుంది. మొత్తం నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. శరీర బరువును సమానంగా పంపిణీ చేసే సపోర్టివ్ మెట్రెస్‌లు ప్రెజర్ పాయింట్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఎక్కువసేపు అంతరాయం లేకుండా నిద్రించడానికి వీలు కల్పిస్తుంది. కఠినమైన ఉపరితలాలపై నిద్రించేవారు అసౌకర్యం కారణంగా తక్కువ నిద్ర వ్యవధిని అనుభవించవచ్చు. దీంతో మరుసటి రోజు శారీరక అలసట, అభిజ్ఞా పనితీరు ప్రభావితం అవుతుంది.

ఇక దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉన్న వ్యక్తులు నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక అమరిక మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే కఠినమైన ఉపరితలాలపై నిద్రపోవడం వల్ల కీళ్ల అసౌకర్యం పెరుగుతుంది. ముఖ్యంగా తుంటి, భుజాలలో ఎక్కువ ఒత్తిడి, ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలు లేదా కండరాల క్షీణత ఉన్నవారికి ఇబ్బంది కలగొచ్చు. వృద్ధులు లేదా బోలు ఎముకల వ్యాధి ఉన్న వ్యక్తులు కూడా కఠినమైన ఉపరితలాలపై నిద్రిస్తున్నప్పుడు ఎముక ఒత్తిడి లేదా కీళ్ల దృఢత్వాన్ని పెంచవచ్చు. గర్భిణీ స్త్రీలు కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఎక్కువ కుషనింగ్ అవసరమయ్యే పరిస్థితులు ఉన్నవారికి ప్రతికూలంగా అనిపించవచ్చు.

Next Story