భయం.. శరీరం, మెదడులో ఇంత భారీ మార్పులకు దారితీస్తుందా?

by Sujitha Rachapalli |

భయం అనేది మనిషి తప్పించుకోలేని ఎమోషన్. విమానం నుంచి పడిపోవడం.. భయానక సినిమాలు చూడటం.. మనకు హాని కలుగుతుందని ఊహించేలా చేసేదాన్ని చూడటం లేదా వినడం... ఫియర్‌కు కారణమవుతుంది. నిజానికి భయం అనేది చాలా పురాతనమైంది.

భయం.. శరీరం, మెదడులో ఇంత భారీ మార్పులకు దారితీస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : భయం అనేది మనిషి తప్పించుకోలేని ఎమోషన్. విమానం నుంచి పడిపోవడం.. భయానక సినిమాలు చూడటం.. మనకు హాని కలుగుతుందని ఊహించేలా చేసేదాన్ని చూడటం లేదా వినడం... ఫియర్‌కు కారణమవుతుంది. నిజానికి భయం అనేది చాలా పురాతనమైంది. ఒక్క విషయంలో భయానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పెద్ద జంతువులు, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి పారిపోయి దాక్కునేందుకు.. ఒక జాతిగా మన విజయానికి కారణమైంది. అయితే ఇలా భయం కలిగినప్పుడు మన శరీరం, మెదడులో ఎలాంటి రియాక్షన్స్ కలుగుతాయి? బాడీలోని ఏ పార్ట్‌ ఏ విధంగా స్పందిస్తుంది?

* మీ శ్వాస రేటు, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త నాళాలు సంకోచించబడతాయి. ముఖ్యమైన అవయవాల చుట్టూ ఉన్న కేంద్ర రక్త నాళాలు వ్యాకోచించి.. ఆక్సిజన్, పోషకాలతో నింపుతాయి.

* కండరాలు రక్తంతో నిండి పోతాయి. భయాన్ని కలిగించే దేనికైనా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉంటాయి.

* ప్రతి వెంట్రుక అడుగు భాగంలో ఉన్న కండరాలతో సహా అన్ని మజిల్స్ బిగుతుగా మారుతాయి. దీని వలన పైలోరెక్షన్ ఏర్పడుతుంది. దీనినే గూస్‌బంప్స్ అంటాం.

* మనిషి భయాన్ని ఎదుర్కొన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. శక్తి నిల్వను అందిస్తుంది. రక్తప్రవాహంలో కాల్షియం, తెల్ల రక్త కణాల స్థాయిలు పెరుగుతాయి.

* లింబిక్ వ్యవస్థలో భాగమైన అమిగ్డాలాలో పోరాడు లేదా పారిపో అనే ప్రతిస్పందన ప్రారంభమవుతుంది. భయంతో సహా భావోద్వేగాల ప్రాసెసింగ్‌లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అమిగ్డాలా హైపోథాలమస్‌కు సంకేతాలు ఇస్తుంది. నాడీ వ్యవస్థ ఎండోక్రైన్ లేదా హార్మోన్ వ్యవస్థను కలిపే ప్రదేశమైనా.. పిట్యూటరీ గ్రంథిని సక్రియం చేస్తుంది. అప్పుడు పిట్యూటరీ గ్రంథి అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్లను (ACTH) రక్తంలోకి విడుదల చేస్తుంది.

* శరీరం ACTHకి ప్రతిస్పందనగా కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తపోటు, రక్తంలో చక్కెర, తెల్ల రక్త కణాల పెరుగుదలకు కారణమవుతుంది. కార్టిసాల్ ప్రసరణ కొవ్వు ఆమ్లాలను శక్తిగా మారుస్తుంది.

* పోరాడాల్సి వస్తే లేదా పరిగెత్తాల్సి వస్తే.. ఎపినెఫ్రిన్, నోర్‌పైన్‌ఫ్రైన్‌తో సహా కాటెకోలమైన్ హార్మోన్లు కండరాలను చర్యకు సిద్ధం చేస్తాయి. హార్మోన్లు గుండె, ఊపిరితిత్తులలో కార్యకలాపాలను పెంచుతాయి. కడుపు, ప్రేగులలో యాక్టివిటీస్‌ను తగ్గిస్తాయి.

* వినికిడి తగ్గవచ్చు. కన్నీళ్లు, లాలాజల ఉత్పత్తిని అనుభవించవచ్చు. భయంతో నోరు పొడిబారడానికి ఇది కారణం కావచ్చు. కళ్ల లోపల గుడ్లు వ్యాకోచించవచ్చు.

* జ్ఞాపకశక్తిలో ఎక్కువగా పాల్గొనే మెదడు ప్రాంతం హిప్పోకాంపస్, ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే ప్రిఫ్రంటల్ కార్టెక్స్.. భయానికి ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Next Story