- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పగటిపూట నిద్ర ఎక్కువైతే ఏమౌతుంది.. అధ్యయనం ఏం చెబుతోంది!
ఏదైనా సరే అతి అనర్థదాయకం అంటారు పెద్దలు.. అతినిద్ర, పగటి నిద్ర కూడా ఆ కోవలోకే వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా సరే అతి అనర్థదాయకం అంటారు పెద్దలు.. అతినిద్ర, పగటి నిద్ర కూడా ఆ కోవలోకే వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట నిద్రరావడం సహజం. నైట్ షిఫ్ట్‌లు చేసేవారికో, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారికో డే టైమ్‌లో నిద్ర ముంచుకొస్తోందంటే పర్లేదు. కానీ అలాంటి కారణాలేమీ లేకపోయినా ప్రతిరోజూ పగటిపూట నిద్ర ముంచుకొస్తేనే రిస్క్.
ఎందుకంటే అది ఓ విధమైన నిద్ర రుగ్మత కావచ్చు. మానసిక, శారీరక, నాడీ సంబంధిత రుగ్మతలవల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎప్పుడో ఒకసారి అయితే నో ప్రాబ్లం. కానీ తరచుగా పగటిపూట నిద్ర రావడం, నిద్రపోకుండా ఉండలేకపోవడం చికిత్స అవసరమయ్యే స్లీప్ డిజార్డర్ భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
న్యూరోలాజికల్ డిజార్డర్
నిద్ర వాస్తవానికి ఆరోగ్యానికి మంచిది. స్లీప్ సైక్లింగ్ దెబ్బతింటేనే ప్రమాదం. అంటే అతి నిద్ర, అసలు నిద్రపట్టకపోవడం, పగటి నిద్ర ఈ మూడూ అనారోగ్యమే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 10 మందిలో ఆరుగురు పగటివేళ అతినిద్ర సమస్యను ఫేస్ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అనుభవిస్తున్నవారు రాత్రిళ్లు బాగానే నిద్ర పోయినప్పటికీ డేలో కూడా ఎప్పుడెప్పుడు కునుకు తీద్దామా అని ఎదురు చూస్తుంటారు.
తరచుగా నిద్ర ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి అనుభూతినే న్యూరో లాజికల్ డిజార్డర్‌గా పేర్కొంటున్నారు న్యూరాలజిస్టులు. ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా, లూపస్, మల్టిపుల్ స్ల్కెరోసిస్, హైపో థైరాయిడిజం, పార్కిన్సన్, నార్కోలెప్సి వంటి మానసిక, శారీరక, నాడీ సంబంధిత అనారోగ్యాలు కూడా ఈ పగటి నిద్రను ప్రేరేపిస్తుంటాయి. దీనివల్ల రోజువారీ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయి.
ఆరోగ్యంపై ప్రభావం
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అతినిద్ర అనేది రుగ్మతగా మారినప్పుడు మెదడు ‘స్లీప్ సైకిల్’ను నిర్వహించడంలో, నియంత్రించడంలో విఫలం అవుతుంది. రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. వర్క్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. కాబట్టి ఎంత ట్రై చేసినా పగటివేళ నిద్రపోవడాన్ని ఆపుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు తగిన చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే సమతుల్య ఆహారం తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, జీవన శైలిలో సానుకూల మార్పులు వంటివి కూడా అతినిద్ర వంటి స్లీప్ డిజార్డర్ల నివారణకు సహాయపడతాయి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






