- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: మనలో చాలామంది ధర తక్కువ అని లీటర్ల కొద్ది పామాయిల్‌రను కొనుక్కొచ్చి.. అన్ని రకాల వంటలకు ఉపయోగిస్తారు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుందని మాత్రం గ్రహించరు. గత కొన్ని దశాబ్దాలుగా పామ్ ఆయిల్ వినియోగం బాగా పెరిగింది. డబ్బు ఆదా చేయడానికి చాలా మంది పామాయిల్ నూనెను ఉపయోగిస్తున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి.. సమాజానికి చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి..
సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది:
పామాయిల్‌లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అధిక LDL గుండె జబ్బులు, స్ట్రోక్‌కు కారణమవుతుంది. అందుకే మనం పామాయిల్‌కు దూరంగా ఉండాలి.
పోషక లోపం:
పామాయిల్‌లో విటమిన్ ఇ, బీటా-కెరోటిన్ ఉన్నప్పటికీ, శుద్ధి ప్రక్రియ వాటి స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. పామాయిల్‌తో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకునే వారి శరీరంలో అనేక పోషకాల లోపాలు ఉండవచ్చు.
గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయి:
మరికొన్ని ఆయిల్స్‌తో కంపేర్ చేసుకుంటే పామ్ ఆయిల్‌లో ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. పామ్ ఆయిల్‌లో 34 శాతం శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అదే ఆలివ్ ఆయిల్‌లో అయితే సగమే ఉంటుంది. ఏది ఏమైనా పామ్ ఆయిల్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పారు. కాబట్టి వీలైనంత దూరంగా పామ్ ఆయిల్‌తో ఉండడం మంచిది లేక పోతే గుండె సంబంధిత సమస్యలు తప్పవు.
ఆకలిని పెంచుతుంది:
పామాయిల్ తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. రీసెర్చ్ చేసిన ప్రకారం పామ్ ఆయిల్‌ని వాడడం వల్ల ఆకలి పెరిగిపోతుందని చెప్పడం జరిగింది.
గ్లోబల్ వార్మింగ్‌కి పామ్ ఆయిల్ దారితీస్తుంది:
మనిషి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మనిషి యొక్క ఎన్విరాన్‌మెంటల్‌ని కూడా ఇది హాని చేస్తుంది. వాతావరణంలో కూడా మార్పులు తీసుకు వస్తుంది. పామ్ చెట్లతో వచ్చే పొగ కారణంగా మన పర్యావరణం కూడా హాని కలుగుతుంది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.






