అదృశ్య సంకేతాలను టెక్నాలజీ అంటున్నాం.. మనిషి, మనసు సంకేతాలను విస్మరిస్తున్నాం.. ఏమిటీ రహస్యం?

by Javid Pasha |   (  Updated:2025-07-18 11:03:08  IST  )

అదృశ్య సంకేతాలను టెక్నాలజీ అంటున్నాం.. మనిషి, మనసు సంకేతాలను విస్మరిస్తున్నాం.. ఏమిటీ రహస్యం?

అదృశ్య సంకేతాలను టెక్నాలజీ అంటున్నాం.. మనిషి, మనసు సంకేతాలను విస్మరిస్తున్నాం.. ఏమిటీ రహస్యం?
X

దిశ, ఫీచర్స్ : వైఫై(WiFi), బ్లూ టూత్(Bluetooth)సిగ్నల్స్, రేడియో తరంగాలు కంటికి కనబడవు. కానీ ఇవి మన ఆలోచనలను, సందేశాలను గాలిలో ప్రసారం చేస్తాయి. ఈ అదృశ్య సాంకేతిక సంకేతాలను ‘సాంకేతికత’గా స్వీకరిస్తాం. వాటిపై ఆధార పడతాం. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, వీడియో కాల్స్ కూడా అంతే.. ఇవన్నీ ఈ సంకేతాల ఫలితాలని విశ్వసిస్తాం. అయితే.. మానవ శరీరం కూడా సంకేతాలను విడుదల చేస్తుందనే ఆలోచనను మాత్రం మనం తేలిగ్గా తీసుకుంటాం. ‘‘అర్థంలేనిది’’గా పరిగణిస్తాం. ఈ రెండు సంకేతాలూ ఒకే గాలిలో సంచరిస్తాయి. కానీ మన విశ్వాసం వాటిని వేరు చేస్తుంది. ఎందుకలా? అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.

స్మార్ట్‌ఫోన్‌లు, వై-ఫై, బ్లూటూత్.. ఇవన్నీ అదృశ్యంగా గాలిలో తిరిగే సిగ్నల్స్ ద్వారా పనిచేస్తాయి. మనం వీటిని ‘‘Technology” అని పిలుస్తాం. వీటిని స్వీకరిస్తాము. వీటిపై ఆధారపడతాం. కానీ సాటి మనుషుల మనసులు, శరీరాలు కూడా కొన్ని సంకేతాలు విడుదల చేస్తాయనే విషయాన్నే పట్టించుకోం. పైగా అలాంటి ఆలోచనే మనకు రాదు. ఎవరికైనా వచ్చినా అర్థరహితమని కొట్టిపారేస్తాం. కానీ నిజానికి మనిషిలోనే మనం అర్థం చేసుకోలేని సాంకేతికత, సంకేతాలు ఉంటాయని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే జీవితానికి సార్థకత చేకూరుతుందని, ఆనందానికి మార్గం దొరుకుతుందని చెబుతున్నారు.

సాంకేతికతలో.. రేడియో తరంగాలు, మైక్రోవేవ్‌లు, ఇతర విద్యుదయస్కాంత తరంగాలు సమాచారాన్ని ఒక చోట నుంచి మరొక చోటికి చేరుస్తాయి. ఇవి కంటికి కనిపించకపోయినా.. వాటి తాలూకు ఫలితాలను మనం చూస్తాం. ఉదాహరణకు వీడియో కాల్స్, ఇంటర్నెట్, సందేశాలు వంటివి ఇందులో భాగమే. అదే విధంగా కొందరు పరిశోధకులు, శాస్త్రవేత్తలు మానవ శరీరం కూడా సూక్ష్మ సంకేతాలను(Subtle signs) అంటే.. బయో ఎలక్ట్రిక్ లేదా బయోఫోటానిక్ సిగ్నల్స్ విడుదల చేస్తుందని వాదిస్తున్నారు కొందరు నిపుణులు. ఇవి మన ఆలోచనలు, భావోద్వేగాలు, లేదా శారీరక స్థితులకు సంబంధించినవని చెబుతున్నారు. కానీ ఈ ఆలోచనను ట్రెడీషనల్ సైన్స్(Traditional science ) తరచూ తిరస్కరిస్తుంది. పైగా “unscientific” అని పిలుస్తుంది.

సాంప్రదాయ శాస్త్రం ‘అన్‌సైంటిఫిక్’ అని భావించే అనేక అంశాల్లోనూ మీకు అర్థం కానీ అసలైన సైన్స్ కూడా ఉందేమో! అంటున్నారు కొందరు నిపుణులు. ఉదాహరణకు మనసు, అంతర్గత ఆలోచన. అవతలి వ్యక్తిపై ప్రేమ, ఇష్టం, ఆలోచన, భావం, కనపడని భావోద్వేగం, కదలిక, జ్ఞాపకం వంటివన్నీ సంకేతాలు కావా? ఏ శాస్త్రం నిరూపించిందని? ఇప్పుడు చెప్పండి. దీనిని ‘సాంకేతికత’ అంటామా? అనకపోయినంత మాత్రానా? ఈ సంకేతాలు అబద్దమా? కాదు కదా..! అదే నిజం కాకుంటే.. ఎక్కడో దూరాన ఉన్న ఒక వ్యక్తిని చూడాలని పదే పదే మనసు ఎందుకు కలవరిస్తుంది? సరిగ్గా మీ మనసు కలవరించినప్పుడే ఆ దూరాన ఉన్న వ్యక్తి మనసులో కూడా ఏదో అలజడి ఎందుకు చెలరేగుతుంది? ఇది ఎవరూ గుర్తించలేని రహస్య సంకేతం కావచ్చు బహుశా. కావాలంటే ఏ ప్రేమికులనో అడిగి చూడండి.

అంతెందుకు వేరే ఊరిలోనో, సిటీలోనో దూరాన ఉన్న బిడ్డకు జ్వరం వస్తే.. మరోచోట ఉన్న తల్లి మనసులో కీడు శంకిస్తుంది. తన బిడ్డకు ఏదో జరిగిందనే అనుమానం వెంటాడుతుంది. ఇంకేముంది? బాగున్నవా బిడ్డా అని ఫోన్ వస్తుంది. బిడ్డకు ఏదో జరిగిందనే సంకేతం తల్లి మనసుకు అందుతుందనే విషయం మీకు తెలుసా? కానీ కంటికి కనబడదు. సైన్స్ నమ్మదు.. ఎందుకంటే ఇది మనసు సంకేతం. మనిషి సంకేతం. అర్థం చేసుకోవాలంతే..!

వైఫై, రేడియో తరంగాలు(Radio waves), బ్లూటూత్ సంకేతాలు, అలాగే మనిషి మనసు, శరీరానికి సంబంధించిన సంకేతాలు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మన విశ్వాసంలో ఉందంటున్నారు నిపుణులు. నిజానికి టెక్నాలజీ సంకేతాలు అంటే.. అంటే రేడియో తరంగాలు, స్మార్ట్ ఫోన్ సిగ్నల్స్ వంటివి కొలవబడతాయి. రీక్షించబడతాయి. ఉపయోగించబడతాయి. కానీ మానవ సంకేతాలు? అవి ఇంకా రహస్యంగానే ఉన్నాయి. అయినప్పటికీ, రెండూ గాలిలోనే సంచరిస్తాయి. ఒకటి మనం సృష్టించిన సాంకేతికత, మరొకటి సహజంగా మనలో, మనసులో ఉండవచ్చు. ఈ రెండింటినీ అర్థం చేసుకోవడం ద్వారా మనం సాంకేతికత, మానవ సామర్థ్యాల మధ్య సంబంధాన్ని మరింత లోతుగా అన్వేషించవచ్చు అంటున్నారు నిపుణులు.

Next Story