Viral Video: ఇదే తగ్గించుకుంటే మంచిది.. కోహ్లీపై చికాకు పడ్డ శ్రేయస్ అయ్యర్... వైరల్ వీడియో

by Vennela |

Viral Video: విరాట్ కోహ్లీ 73 పరుగుల అద్భుతమైన అజేయ ఇన్నింగ్స్ , దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో ఓడించింది.

Viral Video: ఇదే తగ్గించుకుంటే మంచిది.. కోహ్లీపై చికాకు పడ్డ శ్రేయస్ అయ్యర్... వైరల్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: విరాట్ కోహ్లీ 73 పరుగుల అద్భుతమైన అజేయ ఇన్నింగ్స్ , దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో ఓడించింది. రెండు రోజుల క్రితం పంజాబ్ తన సొంత మైదానంలో ఆర్‌సిబిని 5 వికెట్ల తేడాతో ఓడించింది. విజయం తర్వాత కోహ్లీ వీడియో వైరల్‌గా మారింది. కోహ్లీ సెలబ్రేషన్స్ విధానం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు కోపం తెప్పించింది. RCB విజయం తర్వాత కోహ్లీ PBKS కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను తన సంబరాలతో ఆటపట్టిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కోహ్లీ, అయ్యర్ మంచి స్నేహితులు. కానీ ఆదివారం మ్యాచ్ తర్వాత జరిగిన సన్నివేశం ఇద్దరి మధ్య అగాదం పెంచినట్లు కనిపిస్తోంది.

జితేష్ శర్మ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను RCBకి అనుకూలంగా ముగించిన వెంటనే, కోహ్లీ అయ్యర్ వైపు తిరిగి సరదాగా సంబరాలు చేసుకున్నాడు. తన సహచరుడి ఆటపటిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే కోహ్లీ ప్రవర్తనకు శ్రేయస్ అయ్యర్ హర్ట్ అయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయ్యర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ వెళ్లినప్పుడు అయ్యర్ ఎలాంటి ఆప్యాయత చూపించకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, కోహ్లీతో కలిసి దేవదత్ పడికల్ ఆర్‌సిబి తరఫున స్టార్‌గా నిలిచాడు. కేవలం 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. బంతితో, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ ఇద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా పొదుపుగా కూడా వ్యవహరించారు. వారి నాలుగు ఓవర్లలో వరుసగా 25, 26 పరుగులు ఇచ్చారు. ఈ ఓటమి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. రెండు రోజుల క్రితం పంజాబ్ జట్టు కోహ్లీ జట్టును వారి సొంత మైదానంలో 5 వికెట్ల తేడాతో ఓడించింది.




Next Story