- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? వీటిని అస్సలు మిస్సవ్వకండి
పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ఆహారాలు ఇవే అంటున్నారు నిపుణులు.

దిశ, వెబ్ డెస్క్ : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ఆహారాలు ఇవే అంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ ఓ లుక్ వేద్దాం.
*నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాల తొలగింపు వేగవంతం అవుతుంది. ఇది మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి, కొవ్వు కరిగించే ప్రక్రియను సక్రమంగా నడిపిస్తుంది.
*పచ్చి కూరల్లో క్యాబేజీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండడమే కాకుండా, అధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.
*జీలకర్రను రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి పలు లాభాలు కలుగుతాయి. ఇది మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి కొవ్వును తక్కువ చేసే విధంగా పని చేస్తుంది. ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
*గ్రీన్ టీ రోజూ 1 నుంచి 2 సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో జిడ్డును తగ్గించడమే కాకుండా.. ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు తగ్గించడంలో సహకరిస్తుంది.
*తక్కువ కొవ్వు కలిగిన మజ్జిగలో ఉన్న ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించి పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది.
*పెసరపప్పు ప్రోటీన్, ఫైబర్ లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి తక్కువ సమయంలో అవసరమైన శక్తిని అందిస్తూ.. ఆకలిని నియంత్రించేలా సహాయపడుతుంది. దీని వల్ల తరచూ తినాలనే భావన తగ్గిపోతుంది. దీంతో అధికంగా తినకుండా ఉండటం వల్ల కొవ్వు క్రమంగా తగ్గుతుంది.
*ప్రతి ఉదయం ఓట్స్ తీసుకోవడం శరీరానికి తేలికపాటి, తృప్తికరమైన ఆహారంగా పని చేస్తుంది. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ రకం పొట్టలో కొవ్వు పేరుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ స్థాయులను స్థిరంగా ఉంచుతుంది.
*దాల్చినచెక్కలో ఉండే న్యూట్రియెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను సమతుల్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. ఇది బాడీలో ఇన్సులిన్ కి ఉత్తమంగా స్పందిస్తుంది. దాంతో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
గమనిక : పైవార్తలో సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం ఇస్తున్నాం. పైవార్తలో మీకు అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






