శృంగారంలో నేనే తోపు అనుకున్నాడు.. బెడ్‌రూమ్‌లో భార్య ఇచ్చిన స్ట్రోక్‌కు వైరల్ అయ్యాడు..(స్టోరీ అదిరింది)

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-01 04:53:46  IST  )

భార్య.. బిడ్డ.. మంచి కుటుంబం.. కంఫర్టబుల్ జాబ్.. సొసైటీకి గొప్ప మనిషి.. ఇదంతా ఓకే. ప్రపంచానికి మంచోడివే కానీ నాలుగు గోడల మధ్య భార్యను ఎలా ట్రీట్ చేస్తున్నావ్? బుట్ట బొమ్మగా చూస్తున్నవా.. సెక్స్ డాల్‌గా ట్రీట్ చేస్తున్నవా?

శృంగారంలో నేనే తోపు అనుకున్నాడు.. బెడ్‌రూమ్‌లో భార్య ఇచ్చిన స్ట్రోక్‌కు వైరల్ అయ్యాడు..(స్టోరీ అదిరింది)
X

దిశ, ఫీచర్స్ : భార్య.. బిడ్డ.. మంచి కుటుంబం.. కంఫర్టబుల్ జాబ్.. సొసైటీకి గొప్ప మనిషి.. ఇదంతా ఓకే. ప్రపంచానికి మంచోడివే కానీ నాలుగు గోడల మధ్య భార్యను ఎలా ట్రీట్ చేస్తున్నావ్? బుట్ట బొమ్మగా చూస్తున్నవా.. సెక్స్ డాల్‌గా ట్రీట్ చేస్తున్నవా? శయనేషు రంభగా ఉండమని హితబోధ చేస్తారు సరే ఆమె మనసుకు నచ్చని రోజు కూడా అలాగే మెప్పించాలా? కామంతో శరీర భాగాలన్నీ కొరికిపడేస్తున్నా భర్తే కదా అని భరించాలా? మృగాడిలా దాడి చేస్తే ఊరుకోవాలా ఎదురుతిరగాలా? ఇంతకీ ఆమె శరీరంపై హక్కు ఆమెదా లేక ఆయనదా? సొసైటీలోకనిపించిన ఆడపిల్లను వశం చేసుకోవాలని భర్త ప్రయత్నిస్తున్నాడని భార్యకు తెలిస్తే ఏం జరుగుతుంది? పరువు పోతుందని చేతులు ముడుచుకుని కూర్చుంటుందా లేక తనలాంటి గతి మరెవరికీ పట్టకూడదని పోరాడుతుందా? అన్నదే ‘వివేకానందన్ వైరల్’ మూవీ స్టోరీ.

ఒక అమ్మాయి బయట అడుగుపెట్టిందంటే.. కొన్ని వందల మంది మృగాళ్ల చూపులు ఆమె శరీరాన్ని తినేసేలా చూస్తాయి. తనతో సమ్ ఎక్స్ అండ్ జెడ్ అయిపోయినట్లు కొందరు ఊహించుకుని ఎంజాయ్ చేస్తే.. ఇంకొందరు కావాలనే తాకి పైశాచికానందం పొందుతారు. ఈ సెకండ్ కేటగిరి ఏదైతో ఉందో అందులోనే నెక్స్ట్ లెవల్ దుర్మార్గులు ఉంటారు. లైంగిక సామర్థ్యం ఉన్నా లేకపోయినా.. లేహ్యం, చూర్ణం, వయాగ్రా లాంటివి మింగుతూ.. ఆడదానికి ఇష్టం లేకపోయినా పడకగదిలో రాక్షసంగా ప్రవర్తిస్తారు. ఈ మధ్య విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంట్ ఇందుకు ఉదాహరణ. కాగా భర్త పోర్న్ వీడియోలకు బానిసైపోయి.. అందులోని సెక్స్ పొజిషన్స్ ట్రై చేయాలని భార్యను ప్రతిరోజు వేధించేవాడు. ఇంటెన్స్ ఇంటిమసీతో శాటిస్‌ఫాక్షన్ కోసం వయాగ్రా తీసుకునేవాడని తెలిసింది. ఇంత సెక్సువల్ టార్చర్ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సమాజంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉంటాయి. పరువు కోసం అంతర్గతంగా కుమిలిపోతూనే ఉంటాయి. ప్రాణం పోయిన తర్వాతే బయటకు వస్తాయి.

ఇక ‘వివేకానందన్ వైరల్’ సినిమా విషయానికి వస్తే వివేకానందన్‌కు మంచి ఫ్యామిలీ ఉంటుంది. అందమైన భార్య సొంత ఊరిలోనే వర్క్ చేస్తుంది. ఆయన మాత్రం సిటీలో జాబ్ చేస్తూ.. వీకెండ్స్‌లో వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇలా వారాంతంలో కలుస్తున్నారంటే.. భార్య తన భర్త కోసం వేయి కళ్లతో ఎదురుచూడాలి. కానీ ఇక్కడ వివేకానందన్ భార్య మాత్రం వణికిపోతుంది. కారణం సెక్స్‌ పేరుతో పెట్టే టార్చర్. బాడీ అంత కొరికి గాయాలు చేయడం. అయినా సరే ఆమె ఆరేళ్లుగా భరిస్తూనే ఉంటుంది. ఎవరికి చెప్పుకోకుండా తనలో తానే బాధపడుతుంది. వివేకానందన్ వీకెండ్ సంగతి ఇది.. మరి వీక్ డేస్‌ విషయం కూడా తెలుసుకోవాలి కదా. ఆయనగారికి ఎలాగూ సెక్సువల్ డిజైర్స్ ఎక్కువగానే ఉంటాయి. ఒక్కరోజు కూడా ఆ పని చేయనిదే నిద్రపోడు. మరి అలాంటి వ్యక్తి ఐదు రోజులు ఎలా ఉండగలడు. అఫ్ కోర్స్ ఉండలేడు కాబట్టి ఇల్లీగల్ రిలేషన్ సెట్ చేసుకుంటాడు. ఆమెను కూడా భార్య లాగానే శారీరకంగా హింసిస్తాడు. ఎంతలా అంటే ఆమె తల్లి చనిపోయి బాధలో ఉన్నా సరే తనకు సుఖం కావాలనేంత స్థితికి దిగజారిపోతాడు. తన ప్లెజర్ కోసం ఇన్నాళ్లు మంచిగా నటించిన అతను.. వద్దు అనే సరికి దాడి చేస్తాడు. నా శరీరం నా హక్కు .. నేను వద్దంటే నా ఒంటిపై చేయొద్దు అని హెచ్చరించినా.. నీచంగా వ్యవహరిస్తాడు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. భార్య, ప్రియురాలు ఉన్నా సరే మరో అమ్మాయిని లైన్‌లో పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. దీంతో ఇక్కడే ఈ కథకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న ప్రియురాలు... ఆయన భార్యను కలిసి ఏం చెప్పింది? సాధారణంగా తనకు సవతి ఉందని తెలిస్తే రుద్రావతారం ఎత్తే అమ్మాయి.. అతని అసలు రంగు బయటపెట్టేందుకు ఎందుకు ఒప్పుకుంది? ఎవరు ఒప్పిస్తారు? వివేకానందన్ వైరల్ ఎలా అయిపోయాడు? చివరకు వారు తీసుకున్న నిర్ణయమేంటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మగాడే కాదు మొగుడైనా సరే ఆడది ఓకే అంటేనే ఆమె శరీరంపై చేయి వేయాలి? లేదంటే చేతులు ముడుచుకుని ఆగిపోవాలి? అనే మెసేజ్‌ను ఇవ్వడంలో మూవీ ఎంత సక్సెస్ సాధించింది అనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి.

సినిమా : వివేకానందన్ వైరల్

స్టారింగ్ : షైన్ టామ్ చాకో, శాస్విక విజయ్, గ్రేస్ ఆంటోనీ, మెరీనా మైఖేల్

డైరెక్షన్ : కమల్

Next Story