- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: మహాతల్లి.. రెండు కొబ్బరి చిప్పలతో ఈ ఏడాది ఏకంగా రూ. 50 వేలు మిగిల్చింది.. ఈ వైరల్ వీడియో చూస్తే షాకే
Viral Video: ఎండలు మండిపోతున్నాయి ఈ దెబ్బతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఎండలు మండిపోతున్నాయి ఈ దెబ్బతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. కాస్త డబ్బు ఉన్నవాళ్లు ఏసీలు పెట్టించుకుంటే, మరి కాస్త మిడిల్ క్లాస్ వారు ఎయిర్ కూలర్లతో గడిపేస్తున్నారు. మరి పేదవాళ్ల సంగతి ఏంటి అని ఆలోచించవచ్చు. పెరుగుతున్న ఎండల మూలంగా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ వైరల్ వీడియోలో ఒక మహిళ కేవలం రెండు కొబ్బరి చిప్పలను ఉపయోగించి ఇంట్లోనే ఏసీ గాలిని అనుభవించవచ్చని ఒక చక్కటి చిట్కాను ఇచ్చింది.
ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. నిజానికి ఇది చూడటానికి ఒక ఫన్నీ వీడియో లాగానే మీకు కనిపించవచ్చు. కానీ పేద ఇంట్లో చల్లగా ఉండేందుకు ఆమె చేసిన ప్రయత్నం మాత్రం అందరినీ హ్యాట్సాఫ్ అనిపిస్తోంది. నెటిజన్లు సైతం ఆమె ప్రయత్నానికి చప్పట్లు కొడుతున్నారు. ముందుగా రెండు కాళీ కొబ్బరి చిప్పలు తీసుకొని వాటినిండా నీళ్లను నింపి డీప్ ఫ్రిజ్లో ఐస్ అయ్యేదాకా పెట్టింది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆ కొబ్బరి చిప్పలను ఐస్ తో సహా పెట్టి వాటిపైన ఒక తడి గోనె సంచి కప్పి ఉంచింది.
ఇప్పుడు ఈ ఐస్ కరిగేందుకు కాస్త సమయం పడుతుంది. ఈ ఈలోగా ఆ గది చల్లబడుతుంది. ఈ పేదవాడి ఏసీ ఐడియా చూసి చాలామంది నెటిజన్లు హర్షిస్తున్నారు. ముఖ్యంగా రేకుల ఇళ్లల్లో ఉండే వారికి ఇది కాస్త వేడి నుంచి ఉపశమనం అందిస్తుంది. మరి ఫ్రిజ్ లేని వారి పరిస్థితి ఏంటా అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి లాజిక్స్ లేని మ్యాజిక్ చూసే వారికి మాత్రం ఇది ఒక మంచి ఫన్నీ వీడియో గా మిగిలిపోయింది.






