- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ భాష ఇలా కూడా మాట్లాడతారా.. ఈ అమ్మాయి పిచ్చిలేపింది! (వీడియో)
'వారెవ్వా.. పిచ్చి లేపావుగా..!' అంటూ ఆమెని పొగిడేస్తున్నారు. woman speaking Hindi phrases in different foreign accents.

దిశ, వెబ్‌డెస్క్ః మిమిక్రీ అందరూ వినే ఉంటారు. సాధారణంగా ఒక భాషను ఉపయోగించి రకరకాల వ్యక్తులు ఎలా మాట్లాడతారో చెబుతారు. కానీ, ఒక భాషను వివిధ దేశాల్లో ఎలా మాట్లాడతారో అనేది అరుదుగా చేసే ప్రదర్శన. నిజానికి, ఒక భాషలోని పదాలను వారి మాతృభాష కానటువంటి వారు ఎవరైనా మాట్లాడినప్పుడు చాలా భిన్నంగా అనిపించవచ్చు. దానిని హైలైట్ చేస్తూ, ఈ కంటెంట్ సృష్టికర్త ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక యువతి కొన్ని హిందీ పదబంధాలను వివిధ విదేశీ యాసల్లో ఎలా చెబుతారో చాలా స్పష్టంగా, వింతగా, చమత్కారంగా చెబుతుంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అహల్యా బమ్రూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. "గ్లోబల్ దేశీ," అని ఆమె ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. వివిధ యూరోపియన్ దేశాల యాసల్లో ఆమే మాట్లాడేటప్పుడు ఆ దేశం పేరును స్క్రీన్‌పై చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజనులు 'వారెవ్వా.. పిచ్చి లేపావుగా..!' అంటూ ఆమె టాలెంట్‌ని తెగ పొగిడేస్తున్నారు. మీరూ వీక్షించండి.






