- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: బాల్ కు బదులు బాంబ్ వేసిన హార్దిక్ పాండ్యా.. మాడి మసైపోయిన పాకిస్తాన్ ప్లేయర్
Viral Video: భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత నెటిజన్లు పాకిస్తాన్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత నెటిజన్లు పాకిస్తాన్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక మీమర్స్ కూడా రంగంలోకి దిగి పాకిస్తాన్ పొగరును అణగ తొక్కుతున్నారు. బాటిల్ ఫీల్డ్ కన్నా ముందే డిజిటల్ ఫీల్డ్ లో యుద్ధం మొదలైపోయింది. తాజాగా ఎక్స్ ఎకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఇందులో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ పోరులో భాగంగా హార్దిక్ పాండ్యా బంతి విసరగా పాకిస్తాన్ బ్యాటర్ పైన అది బంతి కాదు బాంబులా పేలిపోయింది.
ఈ క్రియేటివిటీ చూసి నెటిజన్లు ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద మూకలు 26 మంది నిండు ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగ్ర దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం కలలో కూడా ఊహించని రేంజ్ లో ఉంటుందని ఆయన ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు.
దీనికి తోడు ఇప్పటికీ పాకిస్తాన్ పైన భారతదేశం దౌత్యపరంగా యుద్ధం ప్రారంభించింది ఇందులో భాగంగా సింధూ నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి భారత తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలను అణిచివేసేలా ఇప్పటికే కాశ్మీర్ ను జల్లడపడుతోంది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ను భారత్ ఇప్పటికే ఏకాకిని చేసేసింది. చైనా తో సహా అమెరికా వంటి అగ్రరాజ్యా లన్నీ పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. అసలే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం తోడైయేలా సోషల్ మీడియా సైన్యం కూడా రంగంలోకి దిగి పాకిస్తానీల భరతం పడుతోంది.
Oreyy 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/PUXitOKxaT
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) April 25, 2025






