Viral Video: ఆ డ్యాన్స్ చేస్తూ స్పృహ కోల్పోయా.. ఇది కదా డెడికేషన్ అంటే..ఊరికే అయిపోరు మెగాస్టార్ అంటున్న చిరు ఫ్యాన్స్

by Vennela |

Viral Video: నాలుగున్నర దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నారు.

Viral Video: ఆ డ్యాన్స్ చేస్తూ స్పృహ కోల్పోయా.. ఇది కదా డెడికేషన్ అంటే..ఊరికే అయిపోరు మెగాస్టార్ అంటున్న చిరు ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: నాలుగున్నర దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ వంటి దిగ్గజ నటులు వెండి తెరను ఏలుతున్న కాలంలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తనదైన శైలితో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నిలదొక్కుకొని సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు.

చిరంజీవి ఊరికే మెగాస్టార్ అయిపోలేదని ఆయన ఫ్యాన్స్ చెబుతుంటారు. దాని వెనుక ఎంతో కష్టం ఉందని మొక్కవోని దీక్ష పట్టుదల ఉన్నాయని, ఎన్నో కష్టాలు ఉన్నాయని వాళ్ళు చెబుతుంటారు. తాజాగా ఓ వీడియో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విశేషాలను పంచుకుంటూ దినక్కుతా పాటలో తాను 104 ఫారన్ హీట్ టెంపరేచర్ తో జ్వరం ఉన్నప్పటికీ, షూటింగు ఆపివేస్తే నిర్మాతకు లక్షల రూపాయలు నష్టం వస్తాయని భావించి, కష్టతరమైన డ్యాన్స్ తో ఉన్న పాటలో ఆయన నటించారు.

చిరంజీవి జ్వరంతో కాలిపోతున్న ఆయన డెడికేషన్ లో మాత్రం ఏ మాత్రం తేడా రాలేదు. డాన్స్ స్టెప్పుల్లో కానీ, ముఖంలో కానీ ఎలాంటి అలసట కనిపించలేదు. కానీ పాట పూర్తయిన తర్వాత ఒకసారిగా దర్శకుడు చెప్పగానే చిరంజీవి స్పృహ కోల్పోయానని కళ్ళు తెరిచి చూస్తే తాను ఆసుపత్రిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఈ అనుభవం షేర్ చేసుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఊరికే అయిపోరు మెగాస్టార్ అందుకు ఒక బలమైన రీజన్ ఉంది అంటూ వారు తమ హీరోను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎంతో కృషి దీక్ష పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు అనడానికి చిరంజీవి ఒక బలమైన సాక్ష్యం అని నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవి ఈరోజు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలకు ఆదర్శమని చెప్పవచ్చు. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు చిరంజీవి ఒక దిక్సూచి అని చెప్పవచ్చు.



Next Story