- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: అందుకే పక్కనోళ్ల కొంపల్లోకి చూడకూడదు అనేది.. పాపం ఫీల్ అయినట్టుండు కాక!
Viral Video: మన చుట్టుపక్కల గొడవలు అనేవి కామన్. భార్యా భర్తలు, అత్తా కోడలు, అన్నదమ్ములు, తోడికోడళ్ళు ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో గొడవ నడుస్తూ ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : Viral Video: మన చుట్టుపక్కల గొడవలు అనేవి కామన్. భార్యా భర్తలు, అత్తా కోడలు, అన్నదమ్ములు, తోడికోడళ్ళు ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో గొడవ నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ గొడవలు చాలా హింసాత్మకంగా కూడా మారిపోతుంటాయి. అయితే ఎన్ని గొడవలు జరిగినా వాటి మధ్యలో మనం వేలు పెట్టకపోవడమే మంచిది అని చరిత్ర చెబుతోంది.
ఎందుకంటే దగ్గర వారు ముందు కొట్టుకుంటారు కానీ చివర్లో కలిసిపోతారు. బయటివారు వేలు పెడితే మాత్రం వారే చిత్తయిపోతారు. అవును మీరు వింటున్నది నిజమే సరిగా అలాంటి వైరల్ వీడియో ఒకటి ఇప్పుడు చూద్దాం.
ఈ వీడియోలో వ్యక్తి తన మానాన తాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న శబ్దం వినిపించింది.ఇంకేముంది మాస్టారికి కుతూహలం ఎక్కువైపోయి గేటు ఎక్కి మరి తొంగి చూశాడు. కానీ వెంటనే ఫలితం కనిపించింది. ఓ పెద్ద గిన్నె వచ్చి అతడి తలకు తగిలి కింద పడిపోయాడు.దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటంటే మనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చవద్దని. తల దూర్చితే ఇలా తలపగలడం ఖాయం అని ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.
మనం కూడా నిత్యజీవితంలో ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. వాటిని చూసి వదిలేయాలి కానీ అందులో మనం తలదూర్చకూడదు అన్నది సారాంశం. సమాజంలో ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు సహజంగా ఉంటాయి. వాటిని వారే పరిష్కరించుకుంటారు. లేదా పరిష్కారం కోసం పెద్దమనుషుల సహాయం తీసుకుంటారు. అంతేగాని వారు అడగకపోయినా మనం కల్పించుకుంటే మాత్రం ఇలాంటి శాస్తి జరుగుతుందని చెప్పవచ్చు. దీన్నిబట్టి అర్థం చేసుకునేది ఏమిటంటే తనకు మాలిన ధర్మం పనికిరాదు అని మన పని మనం చేసుకుంటే ఉత్తమం అని పెద్దలు చెప్పిన మాట గుర్తుకు రావడం ఖాయం.
Viral video Don't involve in others matters it can harm you badly






