- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : ఆన్‌లైన్ డిబేట్స్‌తో ఎక్కువ కాలం జీవించండి..! ఒత్తిడిని తగ్గించి, మెదడును చురుగ్గా ఉంచే రహస్యమిదే..
అన్‌లైన్ డిబేట్లలో పాల్గొనే వ్యక్తులు మెంటల్లీ యాక్టివ్‌గా మారుతారని, ఫలితంగా వీరు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు. కొందరు స్క్రోల్ చేయడంతోపాటు తమకు నచ్చిన అంశాలను పోస్ట్ చేయడం, ఇతరులు పోస్ట్ చేసిన వాటిపై కామెంట్ చేయడం చేస్తుంటారు. మరికొందరు ఏదో ఒక అంశాన్ని ఎంచుకొని డిబేట్ నిర్వహిస్తుంటారు. అయితే ఇలా అన్‌లైన్ డిబేట్లలో పాల్గొనే వ్యక్తులు మెంటల్లీ యాక్టివ్‌గా మారుతారని, ఫలితంగా వీరు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని కూడా కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఆన్‌లైన్ డిబేట్స్ ఏ విధంగా మేలు చేస్తాయో పరిశీలిద్దాం.
వైరల్ నివేదికల ప్రకారం.. ఆన్‌లైన్ వాదన(online debates)ల్లో నిర్మొహమాటంగా పాల్గొనే వ్యక్తులు తమ జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. ఎందుకంటే భావోద్వేగాలను బహిర్గతం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైగా ఆన్‌లైన్ వేదికల్లో సీరియస్ డిస్కషన్స్‌వల్ల మైండ్ యాక్టివ్‌గా మారుతుంది. ఇది అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు రిలాక్సేషన్‌ను అందించడం ద్వారా ఒత్తిడి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గుతుంది. అలా కాకుండా భావోద్వేగాలను అణచివేయడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అయితే ప్రత్యక్ష వాదనలకంటే ఆన్‌లైన్ డిబేట్స్‌లో జరిగే వాదనలే ఎందుకు ఎక్కువ మేలు చేస్తాయంటే.. ఇందులో పాల్గొనే వారు మరింత ఎక్కువ స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరిస్తారు. కాబట్టి ఇది ఒత్తిడి స్థాయిలు తగ్గించడం ద్వారా పరోక్షంగా మానసిక ఆనందాన్ని పెంపొందించి, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. ఈ విధానమే మెదడు చురుకుదనాన్ని కాపాడుతూ, జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. Link






