- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: నిజమైన నాగు పాములతో నాగిని డ్యాన్స్.. తాగిన మత్తులో రచ్చ రచ్చ జేసిండ్రు పో..
పెళ్లిలో బరాత్ కామన్.. ఫుల్లుగా మందేసి నాగిని డ్యాన్స్ చేయడం కూడా కామనే. కానీ ఒడిశాలోని భద్రక్ జిల్లాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

దిశ, ఫీచర్స్ : పెళ్లిలో బరాత్ కామన్.. ఫుల్లుగా మందేసి నాగిని డ్యాన్స్ చేయడం కూడా కామనే. కానీ ఒడిశాలోని భద్రక్ జిల్లాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బన్సాడా పంచాయితీలోని చెడక్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో ఇద్దరు పాములు పట్టుకునే వ్యక్తులు, ఓ ట్రాన్స్‌జెండర్ నిజమైన నాగుపాములతో నాగిని డ్యాన్స్ చేశారు. అయితే స్థానికులు కూడా ఈ డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఫోన్‌లో వీడియో తీసుకోవడం మరింత షాక్‌ను ఇస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ధమరా పీఎస్ పరిధిలోని చందబలి రోడ్డులో చోటు చేసుకుంది.
అయితే ఇలా పాములను హింసించడం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం. కాగా ఈ ఘటన ఆచారాలు, చట్టాల మధ్య సంఘర్షణను హైలైట్ చేస్తుంది. ఇక సమాచారం అందిన వెంటనే భద్రక్ వన్యప్రాణి విభాగం ఊరేగింపును అడ్డుకుని.. మూడు నాగు పాములను రక్షించింది. భద్రక్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (వైల్డ్‌లైఫ్) సౌభాగ్య కుమార్ సాహు.. ఈ ఘటనలో పాల్గొన్న స్నేక్ చార్మర్ గుర్తింపు కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సహాయంతో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కాగా ఈ డాన్సర్లు భువనేశ్వర్ నుంచి నియమించబడ్డారని.. అధికారులు రాకముందే సంఘటనా స్థలం నుంచి పరారయ్యారని చెప్పారు.






