- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: మరోసారి వార్తల్లోకి ఎక్కిన తిరుమల.. కల్యాణ కట్టలో ఏం జరుగుతుందో తెలుసా?
Viral Video: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరుకున్న కోర్కెలు తీర్చే కోనేటి రాయునికి మొక్కుబడిగా నగదు, బంగారం, స్థిరాస్తులు కానుకలుగా సమర్పిస్తారు. అలాగే స్వామి నీవే దిక్కూ అంటూ భక్తులు స్వామివారికీ తలనీలాలు సమర్పిస్తుంటారు. తలనీలా సమర్పణకు ప్రత్యేకంగా తిరుమలలో కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టలలో తలనీలాల సమర్పణకు ఏర్పాటు చేశారు.
నిత్యం స్వామి వారికి 40 నుంచి 50వేల మంది వరకు భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శాశ్వత ఉద్యోగులు 243 మందితోపాటు శ్రీవారి సేవ రూపంలో మరో 854 మంది క్షురకులుగా విధులు నిర్వహిస్తుంటారు. ఈ విధంగా నిత్యం స్వామివారికీ సమర్పణకు వచ్చే భక్తులకు గుండు కొడుతుంటారు క్షురకులు. భక్తులకు గుండు చేయించుకుంనేందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగానే గుండు చేసుకునే సదుపాయం కల్పించింది టీటీడీ.
కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే తిరుమలలో మరో డొల్లతనం కనిపిస్తోంది. తిరుమలలో తలనీలాలు తీయడానికి ఓ మహిళా ఉద్యోగి 100 రూపాయలు అడుగుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తలనీలాలు సమర్పించేందుకు డబ్బులు డిమాండ్ చేయడం ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోరా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క గుండు దగ్గర మాత్రమే.. కాదు శ్రీ వారి అలిపిరి మెట్లు దగ్గర బాగ్స్ తీసుకుని దగ్గర.. మొబైల్ తీసుకునే దగ్గర ప్రతి దగ్గర లంచం అడుగుతున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఒక్క గుండు దగ్గర మాత్రమే.. కాదు
— rajul reddy yemmiganuru (@rajul_reddy) April 22, 2025
శ్రీ వారి అలిపిరి మెట్లు దగ్గర బాగ్స్ తీసుకుని దగ్గర.. మొబైల్ తీసుకునే దగ్గర ప్రతి దగ్గర లంచం.. ఏ
దేవుడు ఆస్థానంలో @TTDevasthanams 👎👎👎
Shame on us.. అందరూ తిట్టుకుంటార బయట రాష్ట్రాల వాళ్ళు@PawanKalyan






