మురికిగుంట‌లో మొస‌లితో బాల్‌రూం డ్యాన్స్‌..! వీడియో వైర‌ల్

by Disha Web Desk 20 |
మురికిగుంట‌లో మొస‌లితో బాల్‌రూం డ్యాన్స్‌..! వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మొస‌లిని టీవీలో చూస్తేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. నిజంగా చూశామంటే చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. అలాంటిది ఓ వ్య‌క్తి ఎలిగేటర్‌ని ఎత్తిప‌ట్టుకొని, దాని ముంద‌రి కాళ్ల‌ను చేతిలోకి తీసుకొని, కౌగిలించుకొని బాల్‌రూమ్ డ్యాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుంది. అందులోనూ, ఓ అడివిలో, మారుమూల మురికి గుంట‌లో మొస‌లి ఎంత క్రూరంగా ఉంటుందో క‌దా..? మ‌రి, ఇక్కడ ఈ వ్యక్తి మొసలితో తన జీవితాన్ని గడుపుతున్న‌ట్లు, అత‌డి త‌ల‌ని మొస‌లి మూతి కింద ఆనించి, డ్యాన్స్ చేస్తున్న విధానం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

"ఫ్లోరిడాలో మాత్రమే మీరు ఎలిగేటర్‌తో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తిని చూస్తారు" అని రాసిన‌ ఈ వీడియో పోస్ట్‌ను బిచ్ రిజెక్ట్ అనే పేజి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చాలా మంది ఈ వీడియో నిజ‌మైన‌దేనా అని ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ వీడియోను కామెడీగా ఉందని భావించి ఫన్నీ కామెంట్లను పోస్ట్ చేశారు. ఒకరు "పెళ్లి ఎప్పుడు?"అంటూ స‌ర‌దా కామెంట్ చేశారు.


Next Story

Most Viewed