- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీన్ ఫైండర్ టెక్నాలజీ.. ఆ సమయంలో ఎంతో ఉపయోగం!
నియర్-ఇన్‌ఫ్రారెడ్ వీన్ విజువలైజేషన్ అనేది కాంతిని ఉపయోగించడం ద్వారా చర్మం కింద కంటికి కనిపించని సిరలను గుర్తించే అద్భుతమైన సాంకేతికత.

దిశ, ఫీచర్స్ : చాలా మంది ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే అత్యంత సాధారణ మెడికల్ ప్రక్రియల్లో ఇంజెక్షన్ ఇవ్వడానికో, సెలైన్ పెట్టడానికో సిరలు(veins) దొరకకపోవడం కూడా ఒకటి. ఒక వేళ దొరికినా కొందరి విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. డాక్టర్లు, నర్సులు ఇందుకోసం అనేకసార్లు ప్రయత్నించడం కారణంగా బాధితులు కొన్నిసార్లు నొప్పిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కామే నియర్-ఇన్‌ఫ్రారెడ్ వీన్ విజువలైజేషన్ (Near-Infrared Vein Visualization) టెక్నాలజీ అంటుటున్నారు సాంకేతిక నిపుణులు. వీన్ ఇల్యూమినేషన్ అని కూడా పిలుస్తారు. ఇందుకు ఉపయోగించే పరికరాన్ని వీన్ ఫైండర్, వీన్ వ్యూయర్ లేదా లేజర్ వీన్ ఫైండర్ అంటారు. ఇంతకీ దీనిని ఎవరు డెవలప్ చేశారు? ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.
రియల్ టైమ్ మ్యాపింగ్
నియర్-ఇన్‌ఫ్రారెడ్ వీన్ విజువలైజేషన్ (Near-Infrared Vein Visualization) అనేది కాంతిని ఉపయోగించడం ద్వారా చర్మం కింద మానవ కంటికి కనిపించని సిరలను గుర్తించే అద్భుతమైన సాంకేతికత. దీనిని యూజ్ చేస్తున్న సమయంలో రక్తంలోని హీమోగ్లోబిన్ (Hemoglobin) ఈ కాంతిని గ్రహిస్తుందని, దీంతో చుట్టు పక్కల కణజాలం (tissue) కూడా దానిని ప్రతిబింబిస్తుందని మెడికల్ టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యత్యాసం (contrast) ఆధారంగా రియల్ టైమ్‌లో శరీరంలోని సిరలను మ్యాప్ చేయడం సాధ్యం అవుతుంది. పైగా ఆ మ్యాప్‌ను నేరుగా చర్మంపై ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి డాక్టర్లు లేదా నర్సులకు వీన్స్ ఉన్న సరైన స్థానం స్పష్టంగా కనిపిస్తుంది.
వృద్ధులు, పిల్లలకు మేలు
ప్రస్తుతం ఆక్యువీన్ (AccuVein) వంటి డివైజ్‌లు సిరలు త్వరగా దొరకని రోగులలో ఆ ప్రక్రియను వేగవంతం చేసి, కచ్చితత్వం పెంచడంలో, వెంటనే గుర్తించడంలో సహాయపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, నల్లటి మందమైన చర్మతత్వం కలిగిన వారికి ఈ సాంకేతికత అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఎందుకంటే వీరిలో వీన్స్ త్వరగా దొరికే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆధునిక సాంకేతికత వీన్స్ దొరకని పరిస్థితుల్లో విఫల ప్రయత్నాల సంఖ్యను తగ్గిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ శాంపుల్స్ (Blood samples) సేకరణలో, ఐవీ ఇన్సర్షన్ (Insertion) వంటి ప్రక్రియల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది క్లినికల్ నైపుణ్యానికి పూర్తి ప్రత్యామ్నాయం కాదని, కేవలం సపోర్ట్ టూల్ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. పూర్తి సక్సెస్ అనేది ఇప్పటికీ డాక్టర్లు లేదా నర్సుల శిక్షణ, అనుభవం, పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ ఒక మార్గద్శకంగా సహాయపడుతుందని చెబుతున్నారు.






