- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాంసం తినకపోతే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా? అధ్యయనంలో షాకింగ్ ఫ్యాక్ట్స్!
శాఖాహారాన్ని అనుసరించేవారిలో స్టమక్ క్యాన్సర్లలో 45%, లింఫోమాలో 25% తగ్గుదల కనపించిందని అధ్యయనం పేర్కొన్నది.

దిశ, ఫీచర్స్ : మాంసాహారులతో పోలిస్తే శాఖాహారుల్లో క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉంటుందా? అవుననే అంటోంది ఇటీవలి ఒక పెద్ద అధ్యయనం. వెజిటేరియన్ డైట్‌ను మాత్రమే అనుసరించేవారిలో, నాన్‌వెజిటేరియన్లతో కంపేర్ చేస్తే టోటల్ క్యాన్సర్ రిస్క్ 12% తక్కువగా ఉన్నట్లు ఇందులో వెల్లడైంది. అమెరికా, కెనడాలోని సుమారు 80 వేలమంది సెవెంత్ - డే అడ్వెంటిస్టులపై (Adventist Health Study-2) దశాబ్దంపాటు నిర్వహించిన స్టడీలో ఈ ఫలితాలను గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్(American Journal of Clinical Nutrition)లో ఈ వివరాలు పబ్లిష్ అయ్యాయి.
ఏ క్యాన్సర్‌లో ఎంత శాతం?
శాఖాహారుల్లో ఏయే క్యాన్సర్ల రిస్క్ తగ్గుతుందనే విషయాన్ని పరిశీలిస్తే.. స్టమక్ క్యాన్సర్లలో 45%, లింఫోమాల్లో 25% తగ్గుదల కనపించిందని అధ్యయనం పేర్కొన్నది. అయితే ఇక్కడ అబ్జర్వ్(observe) చేయబడిన వెజిటేరియన్, నాన్‌వెజిటేరియన్ అనే రెండు గ్రూపులు కూడా ఆరోగ్యస్పృహ ఉన్నవారే అయినప్పటికీ ఈ తేడా స్పష్టంగా కనిపించిందని రీసెర్చర్స్ అంటున్నారు. ఈ విధమైన ఫలితాలు ప్రధానంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్(జీర్ణ వ్యవస్థ) సంబంధిత క్యాన్సర్లలో ఎక్కువగా కనిపిస్తాయని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఆహారం, దాని బ్రేక్‌డౌన్ ప్రొడక్ట్స్, గట్ మైక్రోబయామ్‌తో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. కొలోరెక్టల్ క్యాన్సర్‌లో కూడా 21% తగ్గుదల కనిపించినట్లు అధ్యయనం స్పష్టం చేసింది.
సమతుల్య ఆహారం+జీవనశైలి కూడా..
బ్రెస్ట్, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్, లంగ్స్, ఒవేరియన్ వంటి కొన్ని క్యాన్సర్లలో కూడా తగ్గుదల ధోరణుల ఉన్నాయని, కానీ యూరినరీ ట్రాక్ట్ లేదా నరాల వ్యవస్థ సంబంధిత క్యాన్సర్లలో స్పష్టమైన ప్రయోజనం కనిపించలేదని అధ్యయనం పేర్కొన్నది. అయితే ఈ అధ్యయనం ఫలితాలను మాత్రమే వెల్లడించిది కానీ.. ప్రత్యేక కారణాల(Causation)ను నిరూపించదు. కాబట్టి కేవలం శాఖాహారానికి మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇక్కడ హెల్తీ బ్యాలెన్స్‌డ్ డైట్ ముఖ్యమని చెబుతున్నారు. వెజిటేరియన్ డైట్ అనేది ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి మాత్రమే క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో సహాయపడవచ్చు. కానీ వ్యక్తిగత ఆరోగ్య సలహాలకోసం మాత్రమ డాక్టర్లను సంప్రదించాల్సిందే అంటున్నారు నిపుణులు. Link






