- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్స్ సమయంలో మూత్రం చేయాలనే కోరిక..? కానీ ఇది స్త్రీలలో..
సంపర్కం సమయంలో శరీరం ద్రవాలను విడుదల చేస్తుంది. ఇది సర్వసాధారణం. కానీ కొంత మందికి ఈ టైంలో మూత్ర విసర్జన చేయాలని కోరిక ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : లైంగిక సంపర్కం సమయంలో శరీరం ద్రవాలను విడుదల చేస్తుంది. ఇది సర్వసాధారణం. కానీ కొంత మందికి ఈ టైంలో మూత్ర విసర్జన చేయాలని కోరిక ఉంటుంది. మూత్రాశయాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రపంచంలో దాదాపు 50 నుంచి 60శాతం మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అయితే సెక్స్ టైంలో యూరిన్ లీకేజీకి ఇదొక్కటే కాదు చాలా కారణాలున్నాయి.
1. బలహీనమైన కటి నేల కండరాలు
పెల్వక్ ఫ్లోర్ కండరాలు మూత్రాశయం, గర్భాశయం, ఇతర కటి అవయవాలకు మద్దతిస్తాయి. కానీ గర్భం, ప్రసవం, వృద్ధాప్యం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల లైంగిక కార్యకలాపాల సమయంలో యూరిన్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
2. అతి చురుకైన మూత్రాశయం
అతి చురుకైన మూత్రాశయం ఫలితంగా అకస్మాత్తుగా మూత్రం చేయాలనే కోరిక కలుగుతుంది. సెక్స్ సమయంలో శారీరక ప్రేరణ ఈ పరిస్థితిని మరింత పెంచుతుంది. లీకేజీకి దారితీస్తుంది. ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ లక్షణాల కిందకు వస్తుంది.
3. శరీర నిర్మాణ సమస్యలు
కొన్ని శరీర నిర్మాణ సమస్యలు కూడా ఇందుకు కారణం. కటి అవయవ ప్రోలాప్స్ అనే పరిస్థితి కలిగి ఉంటే.. మూత్రాశయం లేదా గర్భాశయం క్రిందికి దిగి మూత్రనాళంపై నొక్కి ఉంటుంది. ఇది సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జరుగుతుంది.
4. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా UTI అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనుభవించే ఒక సాధారణ అంటు వ్యాధి. 2023లో BMC ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ఒక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. UTI మూత్రాశయాన్ని చికాకుపెడుతుంది. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరికలు వస్తాయి. సెక్స్ నుంచి వచ్చే శారీరక ఒత్తిడి ఈ కోరికలను ప్రేరేపించవచ్చు.






