- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Surprising study : పెళ్లి చేసుకోకపోవడమే బెటర్..! ఆ రిస్క్ ఉండదంటున్న నిపుణులు
Surprising study : పెళ్లి చేసుకోకపోవడమే బెటర్..! ఆ రిస్క్ ఉండదంటున్న నిపుణులు

దిశ, ఫీచర్స్ : ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలంటుంటారు పెద్దలు. సాధారణంగా యువతీ యువకుల పెళ్లి ప్రస్తావనల సందర్భంగా ఇలా చమత్కరిస్తుంటారు. అంతేకాదు వివాహమనేది మీ జీవితంలో సంతోషానికి కారణం అవుతుందని పేర్కొంటారు. గత అధ్యయనాలు సైతం ఇదే చెప్పాయి. పెళ్లి కాని వారి(Singles)తో పోలిస్తే, పెళ్లి చేసుకున్న వారు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నాయి. కానీ తాజా అధ్యయనం మాత్రం దానికి భిన్నమైన వాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి చేసుకున్న వారికంటే, పెళ్లి చేసుకోనివారే లైఫ్‌లో హ్యాపీగా ఉంటారని, వీరిలో అల్జీమర్స్(Alzheimers), డిమెన్షియా(Dementia) వంటి రిస్క్ కూడా చాలా తక్కువని పేర్కొన్నది.
అధ్యయనంలో భాగంగా ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(Florida State University)కి చెందిన పరిశోధకులు పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం వ్యక్తుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు. అందుకు సంబంధించి నేషనల్ అల్జీమర్స్ కో ఆర్డినేటింగ్ సెంటర్ (NACC) నుంచి 24,107 మంది వృద్ధుల డేటాను 18 ఏండ్లపాటు విశ్లేషించారు. ఇందులో పెళ్లి చేసుకున్న వారు, పెళ్లిచేసుకోనివారు, విడాకులు తీసుకున్నవారు, వితంతువులు కూడా ఉన్నారు. వీరందరికి సంబంధించిన మానసిక, శారీరక ఆరోగ్యాలకు సంబంధించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఆశ్చర్య కరమైన ఫలితాలను వెల్లడించారు.
పరిశోధకుల ప్రకారం.. వివాహం చేసుకున్న వారితో పోలిస్తే, చేసుకోని వారు, విడాకులు తీసుకున్న వారు, వితంతువులు తమ జీవితంలో ఎక్కువ మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లు గుర్తించారు. ముఖ్యంగా వివాహితులతో పోలిస్తే, వివాహం కానివారిలో అల్జీమర్స్, డిమెన్షియా రిస్క్ 40% తక్కువగా ఉందని కనుగొన్నారు. విడాకులు తీసుకున్నవారిలో, వితంతువుల్లో 17 % తక్కువ రిస్క్ ఉందని గుర్తించారు. అయితే ఈ అధ్యయనం ప్రధానంగా కొద్దిమంది వాలంటీర్ల నుంచి సేకరించిన డేటాపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా తెల్లజాతీయులపై దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి సాధారణ జనభా అంతటికీ ఇదే వర్తిస్తుందని కూడా చెప్పలేం. మరిన్ని పరిశోధనలు కూడా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.






