- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sea water filter : సముద్రపు నీటిని క్షణాల్లో మంచి నీరుగా మార్చే టెక్నాలజీ.. గ్రాఫీన్ ఆధారిత ఫిల్టర్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు
Sea water filter : సముద్రపు నీటిని క్షణాల్లో మంచి నీరుగా మార్చే టెక్నాలజీ.. గ్రాఫీన్ ఆధారిత ఫిల్టర్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు

దిశ, ఫీచర్స్ : మనుషులతోపాటు సమస్త జీవరాశికి ముఖ్యమైన జీవనాధారం నీరు. ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితమైన నీటిని తాగాలని నిపుణులు చెబుతుంటారు. డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేకపోయినా, అందులో లెవెల్స్, ఇతర మలినాలు అధికంగా ఉన్నా తాగడానికి పనికి రాదు. ఇక సముద్రపు నీటి గురించిం అందరికీ తెలిసిందే. అత్యంత ఉప్పగా ఉంటుంది కాబట్టి ఈ నీటిని సాధారణంగా తాగలేం. అయితే ఈ నీటిని సైతం తక్షణమే సురక్షితమైన మంచి నీటిగా మార్చగల అత్యాధునిక గ్రాఫీన్ ఆధారిత(A graphene-based) ఫిల్టర్‌ను యూకే శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
సహజంగానే సముద్రపు నీటిలో అనేక పోషకాలలతోపాటు హానికరమైన మలినాలు కూడా ఉంటాయి. పైగా ఉప్పగా ఉండటంవల్ల నేరుగా తాగడానికి ఉపయోగించలేం. ఈ నీటిని సేకరించి తాగునీటిగా మార్చాలంటే ఇప్పటి వరకున్న టెక్నాలజీ ద్వారా అయితే చాలా సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన గ్రాఫీన్ ఆక్సైడ్ సీవ్ (Graphene Oxide Sieve) అనే అధునాతన ఫిల్టర్ మాత్రం సముద్రపు నీటిని క్షణాల్లో తాగునీటిగా మార్చేస్తుంది. అంతేకాదు ఈ గ్రాఫీన్ మెంబ్రేన్ సూక్ష్మ స్థాయిలో పనిచేస్తూ, సముద్ర నీటిలోని ఉప్పు, అలాగే హానికరమైన మలినాలను తొలగిస్తుంది. ట్రెడీషనల్ డీసాలినేషన్ పద్ధతులతో పోలిస్తే, ఈ ఫిల్టర్ చాలా వేగవంతమైనదే కాకుండా తక్కవు ఎనర్జీని వినియోగిస్తుంది. కాబట్టి నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది.
కొత్తగా అభివృద్ధి చేసిన గ్రాఫీన్ ఆక్సైడ్ సీవ్ (Graphene Oxide Sieve) నీటిని సురక్షితంగా మార్చడంలో పాత పద్ధతులకు భిన్నంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా ఇందులోని గ్రాఫీన్, ఒకే కార్బన్ అణువుల పొరతో రూపొందిన పదార్థమే కాకుండా అసాధారణ బలం, సూక్ష్మ రంధ్రాలను(Has extraordinary strength and micro pores.) కలిగి ఉంటుంది. ఇవి నీటిలోని ఉప్పు, అలాగే ఇతర మలినాలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. కాగా ఈ టెక్నాలజీ సాంప్రదాయ రివర్స్ ఓస్మోసిస్ వంటి ఎనర్జీ- ఇంటెన్సివ్(Energy-intensive) పద్ధతుల కంటే చాలా సమర్థవంతంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.






