- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : రీఛార్జ్ అవసరమే లేదు.. నిరంతరం పనిచేసే బ్యాటరీని డెవలప్ చేసిన UK శాస్త్రవేత్తలు
Technology : రీఛార్జ్ అవసరమే లేదు.. నిరంతరం పనిచేసే బ్యాటరీని డెవలప్ చేసిన UK శాస్త్రవేత్తలు

దిశ, ఫీచర్స్ : కరెంట్ లేనప్పుడు ఉపయోగించుకునే విద్యుత్ జనరేటర్ బ్యాటరీలు సాధారణంగా ఎంత సేపు పనిచేస్తాయి. మహా అయితే రెండు మూడు గంటలు, పెద్ద బ్యాటరీలైతే వాటి సామర్థ్యాన్ని బట్టి ఐదారు గంటల నుంచి 24 గంటల వరకు పనిచేయవచ్చు. అంతేతప్ప రోజుల తరబడి మాత్రం పనిచేయవు. కానీ ఏకంగా 5,700 సంవత్సరాలపాటు ఎటువంటి రీఛార్జ్(Recharge) అవసరం లేకుండానే నిరంతరం విద్యుత్ శక్తిని అందించే ఒక విప్లవాత్మకమైన బ్యాటరీని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.
నిరంతరం విద్యుత్ శక్తిని అందించే బ్యాటరీని డెవలప్ చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, అలాగే యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీ (UKAEA) శాస్త్రవేత్తలు అణు వ్యవర్థాలను ఉపయోగించారు. దీనిని ‘డైమండ్ బ్యాటరీ’ అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ సాంకేతికత న్యూక్లియర్ రియాక్టర్లలో వాడే గ్రాఫైట్ బ్లాక్‌ల నుండి సంగ్రహించబడే కార్బన్-14 అనే రేడియో ఆక్టివ్ ఐసోటోప్‌ను ఉపయోగించుకుంటూ పనిచేస్తుంది. అంటే ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్ అనేది బీటా కణాలు (ఎలక్ట్రాన్‌లు) విడుదల చేస్తుంది. ఈ కణాలు సింథటిక్ డైమండ్ నిర్మాణంలో సెమీకండక్టర్‌గా పనిచేస్తూ, విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియ సోలార్ ప్యానెల్‌ల మాదిరిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఫోటాన్‌ల (కాంతి కణాలు) బదులు రేడియో యాక్టివ్ క్షయం నుంచి వచ్చే ఎలక్ట్రాన్‌లను ఉపయోగిస్తుంది. కార్బన్-14 యొక్క అర్ధ-జీవితం(Half-life) 5,700 సంవత్సరాలు. అంటే ఈ బ్యాటరీ వేల సంవత్సరాల పాటు శక్తి వనరుగా మారుతుంది.






