Diamond Battery : డైమండ్ బ్యాటరీ.. 5,700 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది !!

by Javid Pasha |

Diamond Battery : డైమండ్ బ్యాటరీ.. 5,700 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది !!

Diamond Battery : డైమండ్ బ్యాటరీ.. 5,700 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది !!
X

దిశ, ఫీచర్స్ : కరెంట్ లేనప్పుడు ఉపయోగించుకునే విద్యుత్ జనరేటర్ బ్యాటరీలు సాధారణంగా ఎంత సేపు పనిచేస్తాయి. మహా అయితే రెండు మూడు గంటలు, పెద్ద బ్యాటరీలైతే వాటి సామర్థ్యాన్ని బట్టి ఐదారు గంటల నుంచి 24 గంటల వరకు పనిచేయవచ్చు. అంతేతప్ప రోజుల తరబడి మాత్రం పనిచేయవు. కానీ ఏకంగా 5,700 సంవత్సరాలపాటు ఎటువంటి రీఛార్జ్(Recharge) అవసరం లేకుండానే నిరంతరం విద్యుత్‌ శక్తిని అందించే ఒక విప్లవాత్మకమైన బ్యాటరీని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

నిరంతరం విద్యుత్ శక్తిని అందించే బ్యాటరీని డెవలప్ చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, అలాగే యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీ (UKAEA) శాస్త్రవేత్తలు అణు వ్యవర్థాలను ఉపయోగించారు. దీనిని ‘డైమండ్ బ్యాటరీ’ అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ సాంకేతికత న్యూక్లియర్ రియాక్టర్లలో వాడే గ్రాఫైట్ బ్లాక్‌ల నుండి సంగ్రహించబడే కార్బన్-14 అనే రేడియో ఆక్టివ్ ఐసోటోప్‌ను ఉపయోగించుకుంటూ పనిచేస్తుంది. అంటే ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్‌ అనేది బీటా కణాలు (ఎలక్ట్రాన్‌లు) విడుదల చేస్తుంది. ఈ కణాలు సింథటిక్ డైమండ్ నిర్మాణంలో సెమీకండక్టర్‌గా పనిచేస్తూ, విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియ సోలార్ ప్యానెల్‌ల మాదిరిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story