- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : సముద్రంలో ప్లాస్టిక్‌ను తిని.. పర్యావరణాన్ని రక్షిస్తున్న 3D ప్రింటెడ్ రోబోట్ ఫిష్.!
Technology : సముద్రంలో ప్లాస్టిక్‌ను తిని.. పర్యావరణాన్ని రక్షిస్తున్న 3D ప్రింటెడ్ రోబోట్ ఫిష్.!

దిశ, ఫీచర్స్ : మారుతున్న పరిస్థితులు, మానవ తప్పిదాలు సముద్ర పర్యావరణాన్ని సైతం కలుషితం చేస్తు్న్నాయి. ముఖ్యంగా ప్లా్స్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంవల్ల అక్కడి జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి నష్టం జరుగుతోంది. అయితే దీని నివారణకోసం యూకేలోని సర్రే యూనివర్సిటీకి చెందిన విద్యార్థి, యువ శాస్త్రవేత్త అయిన ఎలియనోర్ మాకింతోష్ ఒక అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీశారు. సముద్ర కాలుష్యాన్ని తగ్గించగల రోబోట్ చేపను రూపొందించారు. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? దానివల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.
ఎలియనోర్ మాకింతోష్ డెవలప్ చేసిన 3D ప్రింటెడ్ రోబోట్ చేపకు గిల్బర్ట్ అని పేరు పెట్టారు. ఒక పెద్ద సాల్మన్ ఫిష్ పరిమాణంలో ఉన్న ఈ రోబోట్ సముద్ర జలాల్లో కలిసిపోయి, నిజమైన చేపలను అనుకరించేలా తయారు చేశారు. అయితే ఇది సముద్రంలో తిరగాడుతున్నప్పుడు నీటిలోని మైక్రో ప్లాస్టిక్‌లను తింటూ వాటి ద్వారా అవసరమైన శక్తిని స్వయం చాలకంగా ఉత్పత్తి చేసుకుంటుంది. అంటే మైక్రో ప్లాస్టిక్‌లను ఎలక్ట్రిక్ శక్తిగా మల్చుకుంటుంది. కాబట్టి ఈ రోబోట్ చేప అయిన గిల్బర్ట్‌కు ప్రత్యేకంగా పవర్ బ్యాటరీ వంటివి అవసరం లేదు. పైగా సముద్ర కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణ పరిరక్షణలో కీ రోల్ పోషిస్తుంది. ప్రస్తుతం గిల్బర్ట్ ఓపెన్ సోర్స్ డిజైన్‌లో అందుబాటులో ఉంది. దీనిని 3D ప్రింటర్‌తో ఎవరైనా రూపొందించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. Link






