పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో వస్తోన్న టైప్ 5 డయాబెటిస్.. కొత్త ముప్పుగా మారిన ఈ సమస్య లక్షణాలేంటో తెలుసుకోండి?

by Kodari Anjali |

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) టైప్ 5 డయాబెటిస్ అనే కొత్త రకమైన డయాబెటిస్‌ను గుర్తించింది.

పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో వస్తోన్న టైప్ 5 డయాబెటిస్.. కొత్త ముప్పుగా మారిన ఈ సమస్య లక్షణాలేంటో తెలుసుకోండి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) టైప్ 5 డయాబెటిస్ అనే కొత్త రకమైన డయాబెటిస్‌ను గుర్తించింది. ఇది పోషకాహార లోపంతో సంబంధం ఉన్న డయాబెటిస్ అని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది పోషకాహార లోపం ఉన్న టీనేజర్లు, యువకులను ప్రభావితం చేస్తుందని నిపుణులను చెబుతున్నారు.

టైప్ 5 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 25 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు నిపుణులు. టైప్ 5 డయాబెటిస్ అనే భావన తీవ్రమైన ఇన్సులిన్ లోపం ఉన్న డయాబెటిస్ (SIDD)ని సూచిస్తుంది. ఇది ఇన్సులిన్ లోపం.. పేలవమైన జీవక్రియ నియంత్రణ ద్వారా వర్గీకరించబడుతుందని నిపుణులు అంటున్నారు.

టైప్ 2 డయాబెటిస్ మాదిరిగా కాకుండా.. పోషకాహార లోపానికి సంబంధించిన డయాబెటిస్ దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల వస్తుంది. ముఖ్యంగా బాల్యం లేదా కౌమారదశలో వస్తుందని నిపుణులు అంటున్నారు.

టైప్ 5 డయాబెటిస్ మొట్టమొదట 1955లో జమైకాలో నివేదించారు. ఈ టైప్ 5 డయాబెటిస్ 70 సంవత్సరాలకు పై వారిలో గమనించబడినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య చర్చలలో దీనిని ఎక్కువగా పట్టించుకోలేదు.

ఈ పరిస్థితి మొదట 20వ శతాబ్దం మధ్యలో గుర్తించారు. తరచుగా టైప్ 1 లేదా 2 డయాబెటిస్‌గా తప్పుగా వర్గీకరించారు. చాలా కాలంగా ఈ పరిస్థితి గుర్తించలేదు. కానీ లక్షలాది మందిని ప్రభావితం చేసింది. టైప్ 5 డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ లోపంతో బాధపడుతున్నారని తాజాగా ప్రొఫెసర్ స్క్వార్జ్ వెల్లడించారు. దీర్ఘకాలిక పోషక లోపాల కారణంగా ప్యాంక్రియాటిక్ అభివృద్ధిలో లోపాలు దీనికి కారణమని అంటున్నారు.

టైప్ 5 డయాబెటిస్ ముఖ్య లక్షణాలు చూసినట్లైతే.. నిరంతర అలసట, వివరించలేని బరువు తగ్గడం లేదా బరువు పెరగకపోవడం, పెరుగుదల మందగించడం, తరచుగా ఇన్ఫెక్షన్లు. పిల్లలకు అధిక దాహం, మూత్ర విసర్జన పెరగడం, గాయం మానకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఆకలి లేకపోవడం, జీర్ణ సమస్యలు, నల్లటి చర్మపు మచ్చలు (ముఖ్యంగా మెడ చుట్టూ) కూడా కనిపించవచ్చు. వీటితో పాటుగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, పాఠశాల పనితీరుతో ఇబ్బంది పడవచ్చు. సాధారణ డయాబెటిస్ మాదిరిగా కాకుండా.. ఈ లక్షణాలు ఊబకాయం లేకుండా కూడా సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story