సిస్టర్స్ మిరాకిల్.. రూపమే కాదు.. మార్కులూ దాదాపు సేమ్ టు సేమ్

by Javid Pasha |

సిస్టర్స్ మిరాకిల్.. రూపమే కాదు.. మార్కులూ దాదాపు సేమ్ టు సేమ్

సిస్టర్స్ మిరాకిల్.. రూపమే కాదు.. మార్కులూ దాదాపు సేమ్ టు సేమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అప్పట్లో తెలుగులో వచ్చిన హలో బ్రదర్ సినిమా గుర్తుందా ? నాగార్జున డ్యూయల్ రోల్స్ లో ట్విన్స్ లా నటించిన ఆ సినిమాలో ఒకరు ఏం చేస్తే మరొకరు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అది సినిమా కదా ఏదో ఎంటర్టైన్ చేయడానికి అనుకుందాం.. కానీ రియల్ లైఫ్ లోనూ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్విన్స్ లో దాదాపు ఒకే రకమైన ఐక్యూ లెవెల్స్ ఉంటాయని, వారి ప్రవర్తన కూడా నిజజీవితంలోనూ దాదాపుగా సేమ్ టు సేమ్ ఉంటుందని అనేకమార్లు నిరూపితమైంది.

కల్పనా చావ్లా స్కూల్..

రాజస్థాన్ లోని నాగూర్ జిల్లాకు చెందిన కనిష్క చౌదరి, కార్తిక చౌదరి స్థానిక కల్పనా చావ్లా స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. రాజస్థాన్ బోర్డు ఎగ్జామినేషన్లో ఇద్దరూ 97.17% మార్కులు సాధించడంతో తల్లిదండ్రులతో పాటు స్కూల్ టీచర్లు కూడా ఆశ్చర్యపోయారు. పరీక్షల వరకు కూడా ఇద్దరూ కలిసి సబ్జెక్టులు షేర్ చేసుకోవడం, కీలక పాయింట్లు డిస్కస్ చేయడం వరకు గమనించిన పేరెంట్స్ మార్కులు బాగానే సాధిస్తారని అనుకున్నారు. కానీ ఒకే పోలికతో ఉన్న ఇద్దరు కూడా ఒకే రకమైన మార్కులు అది కూడా లాస్ట్ డిజిట్ సేమ్ గా ఉండడంతో నివ్వెరపోవడం అందరి వంతు అయింది. ఈ పిల్లల తండ్రి శివనారాయణ్ రాజస్థాన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్‌లో కండక్టర్‌గా పని చేస్తుండగా తల్లి గృహిణి. ఇక ఈ కవల సిస్టర్స్ అయిన కనిష్క, కార్తీకకు హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, సంస్కృతం ఇలా అన్ని సబ్జెక్టు్ల్లోనూ దాదాపు సమానంగా మార్కులు రావడం విశేషం. ప్రస్తుతానికి వీరిద్దరూ పోటీ పరీక్షల కోసం సిద్ధం అవుతుండగా కెరీర్ ఎంపికలో మాత్రం వేర్వేరుగా డిసైడ్ కావడం కొసమెరుపు. కనిష్క ఇంజనీర్ కావాలని భావిస్తుండగా, కార్తీక డాక్టర్ కావాలని అనుకుంటోంది.

Next Story