నల్లజుట్టు కోసం ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి

by Disha Web Desk 10 |
నల్లజుట్టు కోసం ఈ  సింపుల్ చిట్కా ట్రై చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: వయసు పెరుగుతూ ఉంటే ఆ ప్రభావానికి లోనై నల్ల జుట్టు.. తెల్ల జుట్టుగా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా, పెద్దా అని తేడా లేకుండా తెల్ల జుట్టు వస్తోంది. కొంతమంది అయితే నల్ల జుట్టు కోసం డబ్బు ఖర్చు పెడతారు.. అయినా కూడా అది మళ్లీ తెలుపు రంగులోకి మారుతుంది. తెల్ల జుట్టు నుంచి నల్ల జుట్టుగా మారేందుకు ఈ సింపుల్ ట్రై చేయండి. అదేంటో ఇక్కడ చూద్దాం..

తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చడంలో నల్ల కలోంజి గింజలు బాగా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలో కలోంజి గింజలను ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెట్టాలి. అది చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కుదుళ్లకు కూడా అంటుకునేలా చిన్నగా మర్దనా చేసి ఈ నూనెను అప్లై చేయాలి. ఇలా ఒక రాత్రి అంతా ఉంచుకుని, ఉదయం నిద్ర లేచిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి. అలాగే కలోంజీతో హెన్నాను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలోంజీ గింజలను గిన్నెలో తీసుకుని మెత్తగా గ్రైండు చేసుకోవాలి. హెన్నా కలిపిన పేస్ట్‌ జుట్టు మీద అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తల స్నానం చేసిన తర్వాత జుట్టు నల్లగా మారుతుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed