- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోర్న్ వలలో చిక్కుకున్నారా? నిపుణుల సూచనలు ఇవే!
దిశ, ఫీచర్స్ : సాధారణంగా పోర్నోగ్రఫీ స్వీకరించడంలో తప్పు లేదు. కానీ అతిగా చూస్తే మాత్రం అనర్థమే. ఎగ్జయిట్మెంట్, బోరింగ్, లోన్లీనెస్, సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్, స్ట్రెస్ లెవల్స్.. ఇలా అశ్లీల చిత్రాలు చూసేందుకు చాలా కారణాలున్నాయి..Latest Telugu News

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పోర్నోగ్రఫీ స్వీకరించడంలో తప్పు లేదు. కానీ అతిగా చూస్తే మాత్రం అనర్థమే. ఎగ్జయిట్మెంట్, బోరింగ్, లోన్లీనెస్, సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్, స్ట్రెస్ లెవల్స్.. ఇలా అశ్లీల చిత్రాలు చూసేందుకు చాలా కారణాలున్నాయి. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో రిమోట్ వర్కింగ్ కల్చర్‌తో పోర్న్ వీక్షకుల సంఖ్య మరింత పెరగ్గా.. ఈ 'అశ్లీల వ్యసనం' నుంచి బయటపడటమెలా? ఇంతకీ ఎందుకు మానేయాలి? అనే విషయాలపై నిపుణుల సూచనలు తెలుసుకుందాం.
కొంత మందికి పోర్న్ చూడటం, చూడకపోవడం అనేది మోరల్ ఇష్యూ. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కేవలం ఆనందం కోసం మాత్రమే ఇలాంటి కంటెంట్ చూస్తారు. కానీ ఇంకొందరు మాత్రం కంట్రోల్ చేసుకోలేక అశ్లీలతను అధికంగా స్వీకరిస్తారు. అలాంటి పరిస్థితి సమస్యాత్మకంగా మారవచ్చు. దీన్నే 'పోర్న్ అడిక్షన్' అని పిలుస్తుండగా.. ఇది కచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని పేర్కొంటున్నాయి పలు అధ్యయనాలు. పోర్న్ చూడటం వల్ల కలిగే అతి పెద్ద దుష్ప్రభావాలలో ఒకటి సెక్స్. కాగా ఎదుటి వ్యక్తి నుంచి ఏం ఆశించాలో తెలియక వక్రీకరించే ధోరణి పెరిగిపోతుంది. చూసేదానికి, చేసేదానికి మధ్య వ్యత్యాసం సమస్యాత్మకంగా మారడం ప్రారంభమవుతుంది. అశ్లీల కంటెంట్‌ను అతిగా చూసే వ్యక్తి.. అది లేకుండా ఉద్రేకానికి గురికావడం, లైంగికంగా సరిపోదని భావించడం, రియాలిటీకి దూరంగా భాగస్వామి నుంచి అవాస్తవిక అంచనాలు, లైంగిక సంతృప్తి తగ్గడం లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు.
పోర్న్ చూడకుండా ఉండడమెలా?
* ఇంపాక్ట్ నోట్ చేసుకోవాలి:
కంట్రోల్ లేకుండా అశ్లీల చిత్రాలను అతిగా చూడటం.. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇంపాక్ట్ చూపుతుందనడంలో సందేహం లేదు. పనిమీద కాన్సంట్రేట్ చేయలేకపోవడంతో వర్కింగ్ ప్లేస్‌లో అవమానాలు ఎదుర్కోక తప్పదు. అలాగే ఫ్యామిలీ, స్నేహితులతో కలిసేందుకు కూడా విముఖత చూపుతుండటంతో దూరమైపోతారు. ఇక ముఖ్యంగా భాగస్వామితో ప్రవర్తన అతిపెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు నోట్ చేసుకుంటే మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. లేదా కొద్ది కొద్దిగా పోర్న్‌పై ఇంట్రెస్ట్ తగ్గిపోయే చాన్స్ ఉంటుంది.
* చూసేదంతా నిజం కాదని గుర్తుంచుకోవాలి:
వ్యక్తులు నిజంగా అంగీకరించి, వారు వీక్షిస్తున్న కంటెంట్ 'వక్రీకరించినది, అవాస్తవికమైనది మరియు నకిలీ' అని అర్థం చేసుకుంటే.. ఆటోమేటిక్‌గా దానిపై ఆసక్తి తగ్గిపోతుంది. ఒక ఫాంటసీ ప్రపంచంలో ఉండాలనే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఇది గుర్తించకపోతే మాత్రం జీవితంలోకి సమస్యలను కొనితెచ్చుకున్నట్లే.
* బిజీగా ఉండండి:
రోజూవారి రెగ్యులర్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉంటూనే.. ఇతర అర్థవంతమైన కార్యకలాపాలలో పాల్గొంటూ 24/7 బిజీగా ఉండేలా చూసుకోవాలి. ఇది కాస్తా పోర్న్ కంటెంట్ లాంటి ప్రలోభాలకు దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి ఇందుకు సంబంధించిన ప్లాట్‌ఫామ్స్ బ్లాక్ చేసి.. సృజనాత్మకతతో కూడిన పనులపై దృష్టిపెడితే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందొచ్చు.
* ఒత్తిడి తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలు:
ఈ రోజుల్లో ఒత్తిడి లేనిది ఎవరికి? పోర్న్ చూస్తేనే ఒత్తిడి, ఆందోళనను తగ్గుతుందా? మరిన్ని మంచి మార్గాల్లో ప్రయత్నిస్తే పరిష్కారం దొరకదా? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఒత్తిడిని ఎదుర్కోవడానికి, భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యామ్నాయ ఆరోగ్యకరమైన మార్గాలను అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. ధ్యానం, యోగా, వ్యాయామం, పరిసరాల్లో మార్పు కూడా స్ట్రెస్ లెవల్స్‌ను తగ్గించే సాధనాలుగా పనిచేస్తాయని చెప్తున్నారు.
* సాయం కోరేందుకు భయపడొద్దు:
అశ్లీల వినియోగం లేదా అశ్లీల వ్యసనం చుట్టూ కళంకం ఉంది. ఇది జీవితానికి ఆటంకం కలిగిస్తుందని గుర్తించినప్పుడు.. ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు సహాయం తీసుకోవడంలో వెనుకాడొద్దు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏమనుకుంటారోనని చింతించకుండా.. ఓపెన్‌గా ఉండాలని అంటున్నారు నిపుణులు. మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.






