Viral News: బోడి చదువులు వేస్ట్ అని.. యూనివర్సిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టిన టాపర్ స్టూడెంట్.. రోజుకు ఎంత సంపాదిస్తాడంటే..?

by Vennela |

Viral News: చైనాలోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో టాపర్ విద్యార్థి జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.

Viral News: బోడి చదువులు వేస్ట్ అని.. యూనివర్సిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టిన టాపర్ స్టూడెంట్.. రోజుకు ఎంత సంపాదిస్తాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: Viral News: చైనాలోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో టాపర్ విద్యార్థి జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. ఆ విద్యార్థి తన జీవితానికి సంబంధించిన ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. 24 ఏళ్ల ఫీయు అనే ఈ విద్యార్థి. చైనాలోని అత్యున్నత విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ పూర్తి చేశాడు. ఇప్పుడు అదే విశ్వవిద్యాలయం గేటు దగ్గర ఉడికించిన బంగాళాదుంపలను అమ్ముతున్నాడు. చైనాలో ఉడికించిన బంగాళ దుంపల్లో రకరకాల సాస్ లు మసాలాలు వేసి అమ్ముతుంటారు. అక్కడ ఇదొక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ఈ వ్యాపారం ద్వారా అతడు ఇప్పుడు అతను రోజుకు దాదాపు 1000 యువాన్లు అంటే దాదాపు 12 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.

జియుపాయ్ న్యూస్ ప్రకారం, పేద కుటుంబం నుండి వచ్చిన ఫీ యు, ఒక తెలివైన విద్యార్థి. గ్రాడ్యుయేషన్‌లో అతనికి మంచి మార్కులు వచ్చాయి. మాస్టర్స్ లో చేరిన తర్వాత 2023 సంవత్సరంలో, కేవలం ఒక టర్మ్ మాత్రమే చదివిన తర్వాత, అతను తన చదువును ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంత చదువు చదివినా వేతనం విషయంలో చదువుకు తెలివి తేటలకు సంబంధం లేదని నిర్ణయించుకున్నాడు. ఎన్ని డిగ్రీలు ఉన్నా సంపాదన లేకపోతే వేస్ట్ అని నిర్ణయించుకొని అతడు ఉడికించిన ఆలుగడ్డల వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అతడు ఆ దేశంలో ఒక కంపెనీలో సీనియర్ మేనేజర్ వేతనం కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తూ రోజుకు రూ. 12 వేల వరకు సంపాదిస్తూ తనకు తానే బాస్ అని కాలర్ ఎగరేస్తున్నాడు.

Next Story