World Laughter Day: నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం...నవ్వడం వల్ల ఏ జబ్బులు తగ్గుతాయో తెలుసా..?

by Vennela |

World Laughter Day: ప్రపంచంలో నవ్వు అనే భావం ఉన్న జీవి కేవలం మనిషి మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

World Laughter Day: నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం...నవ్వడం వల్ల ఏ జబ్బులు తగ్గుతాయో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: World Laughter Day: ప్రపంచంలో నవ్వు అనే భావం ఉన్న జీవి కేవలం మనిషి మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. నేడు మే 4వ తేదీ ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం. కొన్ని జంతువులు తమ ఆనందాన్ని వెల్లి పుచ్చుకోవడానికి రకరకాల చేష్టలు చేస్తుంటాయి. కానీ మనిషి మాత్రం ఎంచక్కగా నవ్వుతాడు. నమ్మడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అని పెద్దలు చెప్పారు.

నమ్మడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ తగ్గుముఖం పడుతుంది. ఈ హార్మోన్ ఎక్కువగా ఒత్తిడి ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది. నవ్వడం వల్ల ఈ కార్టిసాల్ హార్మోన్ కంట్రోల్ అవుతుంది. తద్వారా మీరు బీపీ వంటి జబ్బులనుంచి బయటపడవచ్చు. నవ్వు అనేది నాలుగు విధాల చేటు అని సామెత ఉంది కానీ నవ్వు అనేది ఆరోగ్యానికి ఆభరణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇందుకోసం లాఫింగ్ థెరఫీ అనే ఒక ప్రత్యేక చికిత్స విధానం కూడా కనిపెట్టారు. తనివితీరా నవ్వుకోవడం వల్ల ఎలాంటి జబ్బులు రావని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి నవ్వడం ద్వారా మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఒక మనిషి నిత్యం దుఃఖంలో ఉండటం వల్ల అతని శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయని, అవి చివరికి గుండెపోటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులకు కూడా దారితీస్తాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

వీటికి పరిష్కారం చక్కగా నవ్వుకోవడమేనని చెబుతున్నారు. నవ్వడం కోసం అనేక సాధనాలు ఉన్నాయి. మంచి హాస్య సాహిత్యము, సినిమాలు, టెలివిజన్ షోస్ ఇలా మీ టేస్ట్ కు తగ్గట్టుగా ఇప్పుడు నవ్వుకోవడానికి అనేక సాధనాలు లభించాయి. ప్రస్తుతం సోషల్ మీడియా కూడా ఇందుకు ఒక మంచి సాధనంగా మారింది. మీమ్స్, వైరల్ వీడియోలు కూడా చక్కగా నవ్వు తెప్పించేందుకు ఉపయోగపడుతున్నాయి.

Next Story