Mauni Amavasya 2026: నేడు మౌని అమావాస్య...ఈ తప్పులు అస్సలు చేయకండి!

by velandi.Saikiran |

మౌని అమావాస్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి.

Mauni Amavasya 2026: నేడు మౌని అమావాస్య...ఈ తప్పులు అస్సలు చేయకండి!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇవాళ మౌని అమావాస్య అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజున కొన్ని నియమ నిబంధనలు పాటించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇవాల్టి మౌని అమావాస్య జనవరి 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 3 నిమిషాల నుంచి ప్రారంభమైంది. జనవరి 19వ తేదీన అర్ధరాత్రి 1:25 గంటలకు ముగుస్తుందని చెబుతున్నారు. ఈ మౌని అమావాస్య రోజున గంగానది లాంటి పవిత్ర నదులలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం చాలా మంచిదని అంటున్నారు.

ఈ పనులు అస్సలు చేయకూడదు!

మౌని అమావాస్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మౌని అమావాస్య రోజున సముద్ర లేదా గంగా స్నానం చేయాలని చెబుతున్నారు. ఉపవాసం, మౌనవ్రతం, తర్పణం , దానాలు చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయట. ముఖ్యంగా వ్రత ఫలితం దక్కాలంటే, కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

కోపం తెచ్చుకోవడం, మద్యం, మాంసం తినడం అస్సలు చేయకూడదట. గొడవ పెట్టుకోవడం, అనవసర సంభాషణలు, అబద్ధాలు చెప్పడం... నెగిటివ్ థింకింగ్ పూర్తిగా మానేయాలని సూచనలు చేస్తున్నారు. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడిస్తున్నారు పండితులు. క్షుద్ర పూజలు చేసే వాళ్లకు అమృత ఘడియలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇవాళ చిన్నపిల్లలతో బయటకు అస్సలు పోకూడదని కూడా సూచిస్తున్నారు.

Next Story