- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేస్‌బుక్ ఏఐ మీ ఫొటోలను స్కాన్ చేస్తుందని తెలుసా?.. ఎలా ఆపివేయాలంటే..
ఫేస్‌బుక్ (Meta) యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అదే సందర్భంలో మీరు అప్‌లోడ్ చేసే ప్రతీ ఫొటోను, పోస్టును అందులోని ఏఐ స్కాన్ చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : మీరు ఫేస్‌బుక్ యూజర్లకు ఒక ముఖ్య గమనిక! మీరు అప్‌లోడ్ చేసే ప్రతీ ఫొటోను మెటా ఏఐ స్కాన్ చేస్తుందని మీకు తెలుసా? చాలామంది ఇది తెలిసే వాడుతుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన మాద్యమం. అంతేకాకుండా మీ ఫొటోలు, డేటాను ఫేస్ బుక్ కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఉపయోగించుకుంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అదెలా జరుగుతుంది? ఏ విధంగా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్‌బుక్ (Meta) యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అదే సందర్భంలో మీరు అప్‌లోడ్ చేసే ప్రతీ ఫొటోను, పోస్టును అందులోని ఏఐ స్కాన్ చేస్తుంది. ముఖ్యంగా యూజర్లు ముఖాల గుర్తింపు (Facial Recognition), వస్తువులు, స్థలాలు, టెక్స్ట్ వంటి అన్ని అంశాలను విశ్లేషిస్తుంది. ఇక ఈ డేటాను ఉపయోగించి అది మీ వ్యక్తిగత అడ్వర్టైజింగ్ ప్రొఫైల్‌ను రూపొందించడం, మెటాకు సంబంధించిన ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడం వంటి పనులను చేస్తుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇది మెటా సేవా నిబంధన(Meta's Terms of Service)ల్లోనే ఉంది. అయితే ఇది ఇష్టంలేని యూజర్లు దానిని ఆపే అవకాశం కూడా ఉంది.
ఏఐ స్కానింగ్‌ను ఎలా ఆపాలి?
*ఫేస్‌బుక్ మీ డేటాను స్కాన్ చేయడం లేదా కొన్నిసార్లు హ్యాకర్ల వల్ల ఏదైనా రిస్క్ ఉందని భావిస్తే.. అనవసరమైన విశ్లేషణ నుంచి రక్షించుకోవచ్చు. మీ ఫొటోలు, ఇతర డేటాకు సంబంధించి ప్రవైసీ సెట్టింగ్‌లు మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఫేస్ రిగ్నిషన్‌ను, డేటా సోర్సెస్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.
*ఫేస్ రికగ్నిషన్ ఆఫ్ చేయడానికి: Facebook → Settings & Privacy → Settings → Privacy → Face Recognition →లోకి వెళ్లి ఆఫ్ చేయండి.
*యాడ్స్(Ads) డేటా సోర్సెస్ నిలిపి వేయడానికి Settings → Ads → Ad Preferences-లోకి వెళ్లి ఆల్ డేటా సోర్సెస్‌ను ఆఫ్ చేయండి.
*అనవసరమైన యాప్స్ తీసివేయడానికి.. Settings → Apps and Websites-లో మీరు యాక్టివ్‌గా ఉపయోగించని యాప్స్‌ను గుర్తించి రిమూవ్ చేయండి. ఈ సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ ఫొటోలు, డేటాను మెటా ఏఐ విశ్లేషించకుండా ఆపివేయవచ్చు.






