- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బల్లులు ఇంట్లోకి ఎందుకు వస్తాయి..? గృహిణికి లాభమా, నష్టమా..?
దిశ, వెబ్ డెస్క్ : ఇల్లు కొత్తదైనా, పాత ఇల్లైనా మనుషుల కంటే ఎక్కువగా ఇతర జీవులు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా కనిపించే జీవి బల్లి. ఇవి ఇంటి పైకప్పు పగుళ్లు, కిటికీలు, ఎగ్జిస్ట్ ఫ్యాన్లు, వెంటిలేషన్ ద్వారా ఇంట్లోకి చేరుతాయి. ఇంటిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే బల్లులు ఇంట్లోకి వస్తాయి. అలాగే బాత్రూంలో ఉండే గీజర్ పైప్ కు బల్లులు ఆకర్షితులవుతాయి. ఇంట్లో కాలుష్యం, బూజు ఎక్కువైనా బల్లుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో కుళ్ళిన ఆహారం వాసన ఉన్నా బల్లులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అయితే చాలా మంది ఇంట్లో సంచరించే బల్లిని చూసి ఇంటి టాప్ లేచిపోయేట్టు గగ్గోలు పెడుతూ ఉంటారు.
బల్లి కనిపిస్తే చాలు ఏదో పెద్ద భూతాన్ని చూసినట్టు భయపడతారు. ఈ జీవిని ప్రజలు చూడటానికి కూడా ఇష్టపడరు. బల్లులు ఇంట్లో తిరిగే కీటకాలను తిని మనుషులకు సహాయపడతాయి. కానీ అది పొరపాటున వంటకాల్లో పడితే మనుషుల ప్రాణాలకే ప్రమాదం. అందుకే బల్లులను ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి తరిమికొట్టాలా అని ఎదురు చూస్తారు. మరి బల్లులను ఏ విధంగా తరిమికొట్టొచ్చో తెలుసుకుందామా..
బల్లిని ఇంటి నుంచి తరిమే చిట్కాలు..
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే బల్లులు ఇంటి దరిచేరవు. అలాగే ప్రతివారం ఇంట్లో ఉండే బూజును దులపాలి. కిచెన్ సింక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అంతేకాదు బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో ఉల్లిపాయలను పెట్టాలి. వెల్లుల్లి ఘాటును బల్లులు తట్టుకోలేవు. నాఫ్తలీన్ బంతులను ఇంటి మూలల్లో, వెంటిలేటర్లలో పెడితే వాటి వాసనకు బల్లులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా ఆ చల్లదనానికి బల్లులు ఉండలేక బయటకి పారిపోతాయి.
Read more: