ఒత్తిడితో చిత్తవుతున్నారా..? మోరింగా‌ తినండి!

by Javid Pasha |

ఒత్తిడితో చిత్తవుతున్నారా..? మోరింగా‌ తినండి!

ఒత్తిడితో చిత్తవుతున్నారా..? మోరింగా‌ తినండి!
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల ఆధునిక జీవితంలో ఒత్తిడితో సహవాసం తప్పట్లేదు చాలా మందికి. కారణాలేమైనా అదొక మమహ్మారిలా వెంటాడుతోంది. అందుకే ఈ రోజుల్లో ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోలేం కానీ, దానిని మేనేజ్ చేయడం నేర్చుకోవడం వల్ల, కార్టిసాల్‌ను కంట్రోల్ చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో మోరింగా(మునగ లేదా డ్రమ్‌స్టిక్) కూడా ఒకటి.

‘జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ స్టడీ ప్రకారం మునగ కాడలు, ఆకుల్లోని ఒలీఫెరా సప్లిమెంటేషన్ ఒత్తిడిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, అడాప్టోజెనిక్ సమ్మేళనాలు కార్టిసాల్ స్థాయిలను 50% వరకు తగ్గించడంలో సహాయపడతాయి. హార్మోన్ల సమతుల్యతకు దోహదం చేస్తాయి. మోరింగాను సాధారణంగా పొడి (పౌడర్) రూపంలోనూ తీసుకోవచ్చు. స్మూతీలు, టీ, లేదా ఆహారంలో కలిపి కూడా తీసుకోవచ్చు. మునగ ఆకులను, కాడలను కూరగా వండి తినవచ్చు.

మునగలో క్వెర్సెటిన్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతను తగ్గించే సహజమైన యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అంతర్గత ఒత్తిడి సంకేతాలను తగ్గిస్తాయి. మెరుగైన నిద్రను ప్రేరేపించడం ద్వారా నిద్ర నాణ్యతను, మానసిక స్థితిని మెరుగు పర్చడంలో మోరింగాలోని పోషకాలు కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళనలతో చిత్తవుతున్నట్లు భావించేవారు మోరింగాను ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు మాత్రం వైద్య నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే మోరింగాను ఆహారంగా ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Link

Next Story