- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tulasi: తులసి ఆకులను తినేవారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..!

దిశ, వెబ్ డెస్క్ : మనందరి ఇళ్ళలో తులసి ( Tulasi ) మొక్క తప్పకుండా ఉంటుంది. హిందూ సంప్రదాయంలో ఈ మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా, వీటిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వైద్యులు కూడా రోజుకి రెండు లేదా మూడు ఆకులను తినాలని చెబుతున్నారు.
వీటిని తినడం వలన గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అయితే, తులసి ఆకులలో ఉండే పాదరసం మన పళ్ళ ఎనామిల్ దెబ్బతినేలా చేస్తుందని పోషకాహార నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.
తులసి ఆకులను అదే పనిగా నములుతున్నప్పుడు పళ్ళకు అతుక్కుని హాని కలుగుతుందని చెప్పారు. ఇవి ఆమ్లత్వం కలిగి ఉండడం వలన దంతాలు కూడా పాడవుతాయని అంటున్నారు. అయితే, వీటిని ఇతర మార్గాల ద్వారా తీసుకోవడం వలన అనేక లాభాలు పొందవచ్చని అంటున్నారు. తులసి ఆకులను నీటిలో మరిగించి దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తీసుకోవడం వలన దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయని అంటున్నారు.
తులసి ఆకుల రసంలో మిరియాల పొడిలో వేసి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల రసంలో బెల్లం వాటర్ ను కలిపి తీసుకుంటే, కామెర్లు తగ్గుతాయి. తులసి ఆకులను పొడిచేసుకుని, చపాతీల్లోకి తినొచ్చు. తులసి ఆకులను డైరెక్టుగా నమలడం కాకుండా ఇలా తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.