నిజాయితీకి మారు పేరు ఈ గ్రామం.. ఎక్కడుందంటే?

by Yella Dhawani Reddy |

ప్రస్తుతం సమాజంలో మోసాలు, దొంగతనాలు, దోపిడిలు, కుట్రలు, కుతంత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నిజాయితీకి మారు పేరు ఈ గ్రామం.. ఎక్కడుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సమాజంలో మోసాలు, దొంగతనాలు, దోపిడిలు, కుట్రలు, కుతంత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సొంతవారిని సైతం నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మాట వరుసకి కూడా అబద్ధం ఆడని ఓ గ్రామం ఉందంటే నమ్ముతారా! నిజంగానే.. నాగాలాండ్ రాష్ట్రంలోని (Nagaland) ఖొనోమా (Khonoma) అనే గ్రామంలో ఎవరూ అబద్దాలు ఆడరు, దొంగతనాలు వంటి జోలికి అస్సలే పోరు, ఎవరి ఇళ్లకు తాళాలు కూడా వేసుకోరు. ఆసక్తికరంగా ఉన్న ఈ గ్రామం గురించి మరిన్ని విషాయాలు ఇక్కడ తెలుసుకుందాం.

నాగాలాండ్‌లోని ఇండియా-మయన్మార్ దేశాల సరిహద్దుల్లోని కోహిమాకు పశ్చిమాన 20 కిలో మీటర్ల దూరంలో ఖొనోమా అనే గ్రామం ఉంది. అంగామీ జాతికి చెందిన తెగల వారు నివసించే.. ఈ గ్రామం దేశంలోనే నిజాయితీ గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అందుకు కారణం.. వారు అనుసరించే ఆచార సాంప్రదాయాలు. ఇక్కడి ప్రజలంతా కెన్యూ నియమాలకు కట్టుబడి ఉంటారు. కెన్యూ అంటే నిషిద్ధం అని అర్థం. ఎవరైనా కెన్యూను దాటి ప్రవర్తించారా.. ఇక వాళ్ల పని దైవం చూసుకుంటుందని గ్రామస్థులు బలంగా నమ్ముతారు. అందుకే ప్రాణం పోయేంతా పరిస్థితి ఎదురైనా అబద్ధం చెప్పరు. దొంగతనం అనే మాటే ఆ గ్రామంలో వినిపించదు. ఈ గ్రామంలోని దుకాణాల్లో వాటిని నడిపేవారెవరూ ఉండరు. వినియోగదారులు ఎవరికి కావలింది వారు తీసుకుని, డబ్బులు అక్కడ పెట్టి వెళతారంటే అర్థం చేసుకోండి.. అక్కడి ప్రజలు ఎంత నిజాయితీగా ఉంటారో. నిజాయితీ పట్ల వారి నిబద్ధతే ఆ తెగలో పేద, ధనిక అనే అసమానతలు లేకుండా చేసింది. ఇక ఖొనోమా గ్రామంలో ప్రకృతి అందాలను చూస్తే ఎవ్వరైనా మంత్రముగ్ధులవుతారు.

Next Story