Health: ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్

by Phanindra |   (  Updated:2024-11-22 15:34:23  IST  )

మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ఎంతో మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు.

Health: ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : మారుతున్న ఆహారపు అలవాట్ల ( food habits ) వలన ఎంతో మంది ఊబకాయంతో( obesity ) ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే ఫాస్ట్ ఫుడ్ అదే పనిగా తింటారు. దీని వలన బరువు కూడా పెరుగుతున్నారు. దీనికోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు కూడా వాడుతుంటారు. అయినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు బరువు తగ్గాలంటే (weight loss) ఈ జ్యూస్ తాగాల్సిందే.

మనం చేసుకునే కూరల్లో కొత్తిమీరను బాగా వాడుతుంటాము. ఇది, ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని పోషకాలు బరువును తగ్గించేందుకు బాగా సహాయపడతాయి. అలాగే, రోజూ ఉదయం పూట ఈ జ్యూస్‌ను తాగడం వలన సులభంగా బరువు తగ్గుతారు. అలాగే జీర్ణక్రియ పని తీరు మెరుగుపడుతుంది.

ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, మొటిమలను కూడా తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేసి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Read More...

Health Tips : ఈ ఫుడ్ కాంబినేషన్‌ వద్దు.. హెల్త్ రిస్క్‌లో పడవచ్చు!


Next Story