Kali Yuga: క‌లియుగం అంతమయ్యే ముందు జరిగేది ఇదే..!

by Phanindra |   (  Updated:2025-02-13 04:20:06  IST  )

కొన్ని రోజులు తర్వాత అబద్దాలే నడుస్తాయి.

Kali Yuga: క‌లియుగం అంతమయ్యే ముందు జరిగేది ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్ర‌స్తుతం, మనం క‌లియుగంలో ( Kali Yuga ) ఉన్నాము. అయితే, ఇది అంతమవుతోందని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనుషులు ఎదగడానికి చేయకూడని పనులన్ని చేస్తారని, ముందు ముందు ప్రేమ, ఆప్యాయత, పలకరింపులు అన్ని తగ్గిపోతాయని పండితులు కూడా చెబుతున్నారు. వాటిలో సగం ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అని కొందరు భయపడుతున్నారు. క‌లియుగం గురించి వేదాలు కూడా షాకింగ్ నిజాలు చెప్పాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

క‌లియుగంలో నిజానికి విలువ తగ్గిపోతుంది. కొన్ని రోజులు తర్వాత అబద్దాలే నడుస్తాయి. మ‌నుషులు నిజం చెప్ప‌డం పూర్తిగా మానేస్తారు. అలాగే, మంచిత‌నం కొంచం కూడా కనిపించదు. ఎక్కడో నూటికొక్క‌రు మంచివారు ఉంటారు. ముందు ముందు ఆస్తి అంటేనే మనిషిగా చూస్తారు. భార్య, భర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. అక్రమ సంబంధాల వలన విడాకులు ఎక్కువవుతాయి. త‌ల్లిదండ్రుల‌కు పిల్ల‌లు శత్రువులుగా మారతారు. మ‌తాలు, కులాలను అడ్డు పెట్టుకుని ఏం చేయడానికైనా సిద్ధపడతారు.

మనుషులు కన్నా డబ్బుకే ఎక్కువ విలువనిస్తారు. డ‌బ్బున్న వారే రాజులు. ధనం కోసం కుటుంబం, బంధువులను కూడా లెక్క చేయరు. దొంగ‌లు, రౌడీలు రాజులవుతారు. వారి చెప్పిందే వేదం అన్నట్టు ఉంటుంది. వృద్ధులైన తల్లి దండ్రులను పిల్ల‌లు ప‌ట్టించుకోరు.

క‌లియుగం ( Kali Yuga ) అంతమయ్యే ముందు ఏం జరగబోతుంది?

క‌లియుగం అంతం అయ్యే ముందు ఆవులు కనిపించవు. జాలి, దయ , క‌రుణ ఏవి ఉండవు. ఒక‌రినొకరు కత్తులతో చంపుకుంటారు. మేకలు, కోళ్ళు ఏవి ఉండవు. అంద‌రూ చేప‌లు మాత్ర‌మే తింటారు. మ‌హిళ‌లు వింతగా ప్ర‌వ‌ర్తిస్తారు. వ్య‌భిచారాలు ఎక్కువైపోతాయి. మనుషులు 15 ఏళ్ల లోపే చనిపోతారు. చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకుని పిల్ల‌ల‌ను కంటారు. ఆల‌యాలు మొత్తం భూమిలో కలిసిపోయి , ఊహించని వేడి పెరిగిపోతుంది. పెద్ద ప్ర‌ళ‌యం వ‌చ్చి భూమిపై నీరు తప్ప ఏమి ఉండదు. ఆ తర్వాత తిరిగి స‌త్య యుగం ప్రారంభ‌మ‌వుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story