- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హ్యాట్సాప్ డాక్టర్ సాబ్.. 50 రూపాయలకే ట్రీట్మెంట్.!
ధనవంతమైన జీవితాన్ని వదిలి, సొంతూరికి సేవ చేస్తున్నాడు

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల జీతం వదులుకొని బీహార్‌లోని సొంతూర్లో కేవలం రూ.50కే చికిత్స అందిస్తున్నాడొక డాక్టర్. ఆయన పేరు ఎస్ఎం. జియావుర్ రహ్మాన్. ధనవంతమైన జీవితాన్ని వదిలి, సొంతూరికి సేవ చేయాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా అద్భుతం.
- దిశ, ఫీచర్స్
ఆలోచింపజేశిన పేషెంట్
ఢిల్లీలో నాన్-ఇన్వాసివ్ కార్డియాక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు డాక్టర్ రహ్మాన్‌కు ఒక బీహార్ రోగితో పరిచయం ఏర్పడింది. ఆ రోగి రక్తపోటు 20/150గా ఉంది. అతను అలసిపోయి ఆందోళనతో ఉన్నాడు. ఆరా తీస్తే.. ఆ పేషెంట్ ఊర్లో డాక్టర్లే లేరంటా. ఏదైనా సమస్యొస్తే 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఢిల్లీకి రావాలట. అంతా విన్నాక అతడిది డాక్టర్ వాళ్ల ఊరే అని తెలిసింది. "ఆ ఊర్లో పుట్టి, పెరిగి, చదువుకొని ఇక్కడొచ్చి పనిచేస్తున్నా, పైసలు సంపాదిస్తున్నా. ఇదేనా నా ఊరు రుణం తీర్చుకునే తీరు" అని ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఏదో ఒకటి చేసి గ్రామస్తులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు.
హాస్పిటల్ ఏర్పాటు
ఆలోచన వచ్చిందే ఆలస్యం.. డాక్టర్ రహ్మాన్ ఖగారియాలో 50 పడకలతో కూడిన "నేషనల్ మెడికేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్"ను స్థాపించాడు. సాధారణ చెకప్‌లతో పాటు పాము కాటు, గుండెపోటు వంటి అత్యవసర సేవలను అందిస్తున్నాడు, "వైద్యం నాకు వ్యాపారం కాదు, అదొక పవిత్ర కర్తవ్యం" అంటాడాయన. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు హాస్పిటల్ పనిచేస్తుంది. అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు పేషెంట్స్ వచ్చినా ఐదు నిమిషాల్లో వాలిపోతాడు. పేషెంట్లకు అందుబాటులో ఉండాలని తన జీవనశైలిని మార్చుకున్నాడు.
ఫీజు రూ.50 మాత్రమే
డాక్టర్ రహ్మాన్ తన హాస్పిటల్‌లో వేలాది రోగులకు చికిత్స అందించారు. కోవిడ్ సమయంలో ఒకొక్క పేషెంటుకు లక్ష రూపాయల బిల్లు అయినా ఏ ఒక్కరి దగ్గరా పైసా తీసుకోకుండా ఉచితంగా నయం చేసి పంపించాడు. ప్రతీరోజు "నేషనల్ మెడికేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్"లో దాదాపు 70 మంది రోగులకు చికిత్స అందిస్తారు. ఈ రోజుల్లో కన్సల్టేషన్ కోసం రూ.1000-1500 ఫీజు తీసుకుంటున్నారు డాక్టర్లు. కానీ రహ్మాన్ సార్ కేవలం రూ.50 మాత్రమే తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాడు. ఇక్కడకొచ్చేవాళ్లలో చాలామంది రూ. 50 కన్సల్టేషన్ ఫీజు కూడా చెల్లించలేరు. అయినా డాక్టర్ వారికి చికిత్స చేస్తాడు.
లగ్జరీని త్యాగం చేసి
ఢిల్లీలో ఉన్నత జీతం వదిలేసినందుకు ఆయనకు ఎప్పుడూ బాధ లేదు. ఆయన సాదాసీదా జీవితం గడుపుతాడు. పేషెంట్స్ ఆయననొక స్నేహితుడిలా భావిస్తారు. అందుకే వాళ్లు పండించిన థేకువా, పెరుగు, నెయ్యి, చిలకడదుంపలు, కూరగాయలు తీసుకొస్తారు. వాళ్లిచ్చే బహుమతులు ధనం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తాయంటాడు డాక్టర్. రోగుల సంతోషం తనకు లగ్జరీ కంటే ఎక్కువ సంతోషాన్నిస్తాయని అంటున్నాడు. ధనవంతమైన జీవితాన్ని త్యాగం చేసి, పేదలకు నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా డాక్టర్ రహ్మాన్ సమాజ భవిష్యత్తును సానుకూలంగా మారుస్తున్నారు.






