Never do : తీరు మారాలె బ్రో.. జర్నీలో అలాంటి పనులొద్దు!!

by Javid Pasha |

Never do : తీరు మారాలె బ్రో.. జర్నీలో అలాంటి పనులొద్దు!!

Never do : తీరు మారాలె బ్రో.. జర్నీలో అలాంటి పనులొద్దు!!
X

దిశ, ఫీచర్స్ : బస్సులో వెళ్తున్నప్పుడో, ట్రైన్‌లో కూర్చున్నప్పుడో ఇతరులవల్ల మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయా? అవతలి వ్యక్తుల ప్రవర్తనతో విసుగు చెందారా? ఇలా ఎవరూ చేయకూడదని మీరు భావించారా? అలా అయితే మీరు ఒంటరేం కాదు, బాధితుల్లో ఒకరు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలోనూ అనాగరికంగా ప్రవర్తించే వ్యక్తులు అడుగడుగునా కనిపిస్తారు. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో, రద్దీ రద్దీ ప్రదేశాల్లో కొందరు వ్యక్తుల బిహేవియర్ మరీ దారుణంగా ఉంటుంది. అవతలి వ్యక్తి ఏమనుకుంటారోనని కూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తుంటారు. జర్నీలో ఉన్నప్పుడు కర్చీఫ్ లేదా చేతులు అడ్డు పెట్టుకోకుండా తుమ్మడం మొదలుకొని సీట్లపై కాళ్లు చాపుకొని కూర్చోవడం వరకు ఇతరులను ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేస్తుంటారు. ఇవన్నీ సెల్ఫ్ అవేర్‌నెస్ లేని బ్యాడ్ హాబీస్‌గా పరిగణించబడతాయి. కాబట్టి వాటిని నివారించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

అంటు వ్యాధులకు అవకాశం

మీరు పండుగకు ఊరెళ్లినప్పుడో, ట్రైన్‌లో లాంగ్ జర్నీ చేసినప్పుడో గమనించే ఉంటారు. కొందరు ముక్కుకు చేతులు గానీ, కర్చీఫ్ గానీ అడ్డం పెట్టుకోకుండా గట్టిగా తుమ్మేస్తుంటారు. అలాగే నోటిని కవర్ చేయకుండా దగ్గడం, ఆవలించడం చేస్తుంటారు. ఈ ప్రవర్తన చూసేవారికి ఎంత అసహ్యంగా ఉంటుంది? పైగా తుమ్మినప్పుడు ముక్కులో నుంచి, దగ్గినప్పుడు నోటిలో నుంచి వచ్చే తుంపరలు ఇతరుల మీద పడతాయి. అలా చేసిన వ్యక్తికి ఏవైనా అంటు వ్యాధులు ఉంటే? చుట్టు పక్కల ఉన్నవారికి కూడా వ్యాప్తించే అవకాశం ఉంటుంది కదా.. అందుకే బీ కేర్ ఫుల్. ప్రజలతో కలిసి రద్దీ ప్రాంతాల్లో, బస్సుల్లో, రైళ్లల్లో జర్నీ చేసేప్పుడు ఇతరులు తుమ్ముతున్నప్పుడు లేదా మీరే తుమ్మాల్సి వచ్చినప్పుడు ముక్కును, నోటిని దయచేసి కప్పుకోండి.

వాసన వెదజల్లే ఆహారాలు

దగ్గరి ప్రయాణాలైతే ఇంటిలో ఉన్నప్పుడు తిని జర్నీ చేయవచ్చు లేదా గమ్యం చేరాక ఆ పని చేయవచ్చు. కానీ కొందరికి బస్సులో లేదా ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు మాత్రమే ఆహారం లేదా స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే కొందరు ఇలా తినే ఆహార పదార్థాలు ఎక్కువ వాసన కలిగినవి ఉన్నప్పుడు ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. అవతలి వ్యక్తులు పైకి చెప్పకపోయినా ఇలా చేసేవారిని మాత్రం అసహ్యించుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో వాసన వచ్చే పదార్థాలనే కాదు, అసలు దగ్గర ప్రయాణం అయినప్పుడు తినకపోవడమే మంచిది. రైలు లేదా బస్సు దిగిన తర్వాత తింటే బెటర్.

ఫోన్‌లో బిగ్గరగా మాట్లాటం

ప్రయాణంలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఫోన్ మాట్లాకపోవడం మంచిది. తప్పదనుకున్నప్పుడు మెల్లిగా తక్కువ సౌండ్‌తో మాట్లాడితే బాగుంటుంది. దీంతో ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ కొందరు బస్సులో వెళ్తున్నప్పుడు తమ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేయగానే.. చుట్టు పక్కల ఎవరున్నారనేది కూడా చూడకుండా బిగ్గరగా మాట్లాడుతుంటారు. పర్సనల్ విషయాలు, కుటుంబ గొడవలు కూడా ఇతరులకు వినబడేలా మాట్లాడేస్తుంటారు కొందరు. ఇదేం ప్రవర్తన బాస్. చూసేవారికి, వినేవారికి ఎంత అసహ్యంగా ఉంటుంది. సో.. ఇలాంటి వారు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇయర్ ఫోన్ వాడకుండా మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మ్యూజిక్ వినడం, మాట్లాడటం కూడా ప్రయాణాల్లో ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఒకరికి నచ్చిన మ్యూజిక్ ఇరులకు నచ్చాలని లేదు కదా అందుకే అలాంటి బిహేవియర్ సరైంది కాదంటున్నారు నిపుణులు.

వృద్ధులకు సీటు ఇవ్వకపోవడం

ప్రజా రవాణాను ఎంచుకోవడమంటే.. అక్కడ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం మాత్రం కాదు. చుట్టూ జనాలు ఉంటారు. కాబట్టి బస్సులో లేదా రైలులో వెళ్లేకంటే ముందు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం మంచిది. అలాగే జర్నీలో ఉన్నప్పుడు మీ చంకలను, మొహాన్నీ ఇతరులకు మరీ ఆనించి పెట్టడం, దగ్గరగా పెట్టడం వంటివి చేస్తే కంపువాసనతో అవతలి వ్యక్తులు ఇబ్బంది పడతారు. కాబట్టి ట్రిప్‌కు ముందు, ట్రిప్‌లో ఉన్నప్పుడు పర్సనల్ హైజీన్‌పై కాస్త ఫోకస్ పెట్టడం మంచిది. కొందరైతే మరీ కఠినంగా ఉంటారు. చవుదుకున్న యువతీ యువకుల్లోనూ ఈ టైప్ మనుషులుంటారు. బస్సులో వెళ్తున్నప్పుడు సీటులో కూర్చొని ఉంటారు. ఆ సమయంలో గర్భిణులో, వృద్ధులో సీటు దొరకక ఇబ్బంది పడుతున్నా లేచి వారిని కూర్చోండి అని చెప్పరు. ఇంతకంటే అధ్వాన్నం, బ్యాడ్ హాబీట్ మరొకటి ఉంటుందా ఎక్కడైనా?

తాకరాని చోట తాకడం, కాళ్లు చాపడం

ఇప్పటికీ బస్సులో, ట్రైన్లలో, రద్దీ ప్రాంతాల్లో పోకిరీలకు కొదువేం లేదు. స్వీయ అవగాహన లేని వింత మనుషులు తరచూ తారసపడుతూనే ఉంటారు. బస్సులో అయితే సీటుపై కూర్చొని కాళ్లు చాపడమో, ముందు సీటుపై పెట్టడమో చేస్తుంటారు. దీనిని లెగ్ స్ర్పెండింగ్ లేదా మ్యాన్‌స్ప్రెడింగ్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా అసహ్యకరమైన ప్రవర్తన. ప్రజా రవాణా ఎవరికీ పర్సనల్ స్పేస్‌ కాదనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం. కాబట్టి అటువంటి ప్రవర్తన సరైంది కాదు. అలాంటి వ్యక్తులు మారాల్సిన అవసరం ఉంది. అలాగే కొందరు పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీలో ఇతర వ్యక్తులను వెనుకవైపు నుంచి వీపు భాగాల్లో ఇతర తాకరాని చోట తాకుతుంటారు. ఇలా చేసేవారు ఇతరుల దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతారు. పైగా ఇది సరైన ప్రవర్తన కాదు.

నెట్టడం, అరవడం, సీటు ఇవ్వకపోవడం

ప్రయాణాల వేళ కొందరు రద్దీగా ఉన్నప్పుడు ముందుకు వెళ్లండని నెట్టడం, గట్టిగా అరవడం, డోర్ వద్ద నుంచోవడం చేస్తుంటారు. దీనివల్ల ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంటారు. అట్లనే బస్సులో కూర్చున్నప్పుడు కొందరు తాము కూర్చోవడమే కాకుండా బ్యాగు పెట్టడానికి కూడా ఒక సీటు మొత్తం ఆక్రమించుకుంటారు. ఇది చాలా బ్యాడ్ హాబిట్. అవసరమైతే బ్యాగ్‌ని ఒడిలో పెట్టుకొని మరొకరికి సీటు ఇవ్వాలి తప్ప ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. దీంతోపాటు మోచేతులు, కాళ్లు ఇతరులకు తగలకుండా జాగ్రత్త పడాలి. అలాగే న్యూస్ పేపర్ తెరవడం, గోర్లు కొరకడం, మరీ అధికంగా వాసనలు వెదజల్లే నెయిల్ పాలిష్ కలిగి ఉండటం, వృద్ధులు, గర్భిణులకు సీటు ఇవ్వకపోవడం వంటి ప్రవర్తనలు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా ఇలా బిహేవ్ చేసేవారిని ప్రజలు అసహ్యించుకునేలా చేస్తుంది. అందుకే తీరు మారాలె బ్రో.. జర్నీలో కూడా అలాంటి పనులు చేయకండి అంటున్నారు నిపుణులు.

Next Story